తెలంగాణలో ఆదరణ బాగుంది: జవదేకర్‌ | BJP wave in Telangana, says prakash javadekar | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ఆదరణ బాగుంది: జవదేకర్‌

Published Fri, Mar 28 2014 2:27 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

తెలంగాణలో ఆదరణ బాగుంది: జవదేకర్‌ - Sakshi

తెలంగాణలో ఆదరణ బాగుంది: జవదేకర్‌

హైదరాబాద్: ఉగాది నుంచి తమ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతాయని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన ఉందన్నారు. తెలంగాణ అంతటా మోడీ సానుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు. ప్రజలంతా నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలను కుంటున్నారని పేర్కొన్నారు. ఈ సాయంత్రం ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందని చెప్పారు. అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చిస్తామని తెలిపారు.

కాగా, టీడీపీతో ఎన్నికల పొత్తుపై జవదేకర్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చలు ఉగాదిలోపు ఓ కొలిక్కి వచ్చే అవకాశముందంటున్నారు. అయితే టీడీపీతో పొత్తు ఉండదని ఎన్నికల అవగాహన మాత్రమే ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement