కాంగ్రెస్‌కు రెండంకెలూ కష్టమే
బీజేపీ జాతీయనేత ప్రకాష్ జవదేకర్
తిరుపతి, న్యూస్‌లైన్: అవినీతి కాంగ్రెస్‌తో ప్రజలు విసిగిపోయారని ఈసారి ఆ పార్టీకి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో నూ రెండంకెల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు. ఆయన ఆదివారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మా ట్లాడారు. దక్షిణాది రాష్ట్రా ల్లో బీజేపీ బలం పుంజుకుం దని ఆయన చెప్పారు.
సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 25 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రా ల్లో తమ పార్టీతో పొత్తు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు మంచి ఫలితాలు సాధిస్తాయని ధీమా వ్యక్తం చే శారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జై సమైక్యాంధ్ర పేరుతో పెట్టిన పార్టీ జాడ కనపడకుండా పోతుందని ఎద్దేవా చేశారు.