దక్షిణ భారతంలో బీజేపీకే పట్టం: జవదేకర్
విశాఖపట్నం, బీజేపీకే ఈసారి దక్షిణ భారత ప్రజలు పట్టం కట్టనున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థి కం భంపాటి హరిబాబుతో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధే మంత్రంగా ప్రజల్లోకి వెళుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కుంభకోణాలలో కూరుకుపోయిందని విమర్శించారు.
ఎన్నికల సరళిలో భారీ మార్పు కనిపిస్తోందని చెప్పారు. ఇప్పటి వరకూ 440 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయని అందులో మెజార్టీ స్థానాలు తమవేనని ధీమా వ్యక్తం చేశారు. 2009లో దక్షిణాది రాష్ట్రాల్లోని 130 ఎంపీ సీట్లలో యూపీఏ 85 స్థానాలు గెలవగా.. ఈ సారి 15 సీట్లు మించి నెగ్గడం కష్టమని చెప్పారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 30కు పైగా ఎంపీ స్థానాలు గెలిచిన కాంగ్రెస్కు ఈ సారి మూడు సీట్లు కూడా రావన్నారు.