దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి మధ్య కోల్డ్వార్ | Cold War between Bandaru Dattatreya, Kishan Reddy | Sakshi
Sakshi News home page

దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి మధ్య కోల్డ్వార్

Published Fri, Apr 4 2014 7:25 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి మధ్య కోల్డ్వార్ - Sakshi

దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి మధ్య కోల్డ్వార్

హైదరాబాద్: బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మద్య కోల్డ్‌వార్‌ నడుస్తోందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. సికింద్రాబాద్‌ ఎంపీ సీటు విషయంలో ఇరువురి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టు చెబుతున్నారు. సికింద్రాబాద్‌ స్థానం కోసం ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ముందు వీరిద్దరూ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది.

సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం.. బీజేపీలో హాట్ సీట్‌గా మారిపోయింది. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఎక్కువమంది బీజేపీ నేతలు ఆసక్తి చూపుతున్నారు. దత్తాత్రేయ, కిషన్రెడ్డితో పాటు ప్రేమ్‌సింగ్‌రాథోడ్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement