సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని, సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ, దుర్మార్గపు ప్రభుత్వం పోవాలని మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అభి ప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఈ ఎన్ని కల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి అన్ని శక్తిసామర్థ్యాలను వినియోగిస్తామన్నారు. తాము ఎన్నికలకు పూర్తిస్థా యిలో సిద్ధంగా ఉన్నామని, ప్రజల విశ్వాసాన్ని చూరగొంటామని, తెలంగాణ లో బీజేపీ జెండా ఎగరేస్తామని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
సోమవారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్ని కల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్‌ల సమక్షంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ నేత డి.వసంతకుమార్ (ఢిల్లీ వసంత్), జైపాల్‌రెడ్డి, పాపయ్య, స్లీవెన్‌సన్, జహంగీర్, విఠల్, కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు చెందిన కాంగ్రెస్ నేత లక్కి రెడ్డి సురేందర్, లక్కి రెడ్డి సాయి, చీమల లక్ష్మీనారా యణ, బాలాజీ నాయక్, బానోత్ పంతూనాయక్ బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఢిల్లీ వసంత్ హనుమ ఫలాన్ని అందించగా ఈ ‘హనుమఫలమే.. బీజేపీ విజయఫల’మని అన్నారు. మీడియాతో మాట్లా డుతూ ’’మోదీ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో ఎన్నో ఆశలు న్నాయి.. వారి ఆకాంక్షలకు అనుగుణంగా రాబోయే 50 రోజులు మేమంతా ఐకమత్యంతో కష్టపడి పనిచేస్తాం. పార్టీని అధికారా నికి తీసుకొస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.
2, 3 స్థానాల కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటీ
ఇటీవల ప్రధాని రెండు బహిరంగసభల తర్వాత రాష్ట్ర ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చేది బీజేపీ మాత్రమేనని, 2,3 స్థానాల కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పోటీ పడాల్సి ఉంటుందన్నారు. మంగళవారం ఆదిలాబాద్ బహిరంగ సభలో కేంద్రమంత్రి అమిత్ షా పాల్గొంటారని, సాయంత్రం నగరంలోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో.. మేధావులు, విద్యా వంతులనుద్దేశించి ఆయన మాట్లాడతారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment