Kishan Reddy conferred with Global Incredible Inc Leadership Award - Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్‌ ఇన్‌క్రెడిబుల్‌ ఐఎన్‌సీ లీడర్‌షిప్‌ అవార్డు’

Published Mon, Jul 17 2023 6:41 AM | Last Updated on Mon, Jul 17 2023 8:40 AM

Prestigious Leadership Award to Union Minister Kishan Reddy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్‌ ఇన్‌క్రెడిబుల్‌ ఐఎన్‌సీ లీడర్‌షిప్‌ అవార్డు’ వరించింది. భారత్‌–అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్‌–టు–పీపుల్‌ ఎక్స్‌చేంజ్‌ కార్యక్రమాలు నిర్వహించే యూఎస్‌ ఇండియా ఎస్‌ఎంఈ కౌన్సిల్‌ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందించింది. భారతదేశపు సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి చేసిన కృషికి గాను అందిస్తున్నట్లు తెలిపింది.

అమెరికాలోని మేరీలాండ్‌ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రికి అందించారు. కిషన్‌ రెడ్డి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘యూఎస్‌ ఇండియా ఎస్‌ఎంఈ కౌన్సిల్‌’ సంస్థ నుంచి లీడర్‌ షిప్‌ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు పర్యాటక రంగాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది’ అని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement