Minister of Tourism
-
కిషన్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్షిప్ అవార్డు’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్‌సీ లీడర్షిప్ అవార్డు’ వరించింది. భారత్–అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్–టు–పీపుల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే యూఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందించింది. భారతదేశపు సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు పర్యాటకాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన కృషికి గాను అందిస్తున్నట్లు తెలిపింది. అమెరికాలోని మేరీలాండ్ నుంచి వచ్చిన పలువురు ప్రముఖులు ఈ అవార్డును కేంద్రమంత్రికి అందించారు. కిషన్ రెడ్డి ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘యూఎస్ ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్’ సంస్థ నుంచి లీడర్ షిప్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశ ఘనమైన చరిత్రను, సంస్కృతిని కాపాడుకోవడంతోపాటు పర్యాటక రంగాభివృద్ధికి చేస్తున్న కృషికి ఈ అవార్డు దక్కింది’ అని పేర్కొన్నారు. -
పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు స్వీకరణ
-
టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు: మంత్రి ఆర్కే రోజా
సాక్షి, అమరావతి: ఏపీని గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని మంత్రి ఆర్కే రోజా అన్నారు. సచివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పర్యాటకశాఖ మంత్రిగా రోజా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యాటకశాఖ ద్వారా ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. ఏపీలో టూరిజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డే బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన సంస్కరణలతోనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ‘టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం పై ప్రత్యేక శ్రద్ధ పెడతాం. రాష్ట్రంలో అనేక పర్యాటక వనరులున్నాయి.వాటిని గుర్తించి అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుతాం. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటాం. సీఎం జగన్ పాలనను పక్క రాష్ట్రాలలో సైతం ప్రశంసిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడతాం. టీడీపీ, తోక పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.’ అని తెలిపారు. రాజకీయ నేపథ్యం: 1999లో టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి వచ్చి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2004లో నగరి నియోజకవర్గం, 2009లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున నగరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచారు. 2019 నుంచి 2021 వరకు ఏపీఐఐసీ చైర్మన్‌గా బా«ధ్యతలు నిర్వర్తించారు. -
పర్యాటక రంగంపై తెలంగాణ–కేరళ కలిసి పనిచేస్తాయి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ–కేరళ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలు నిరంతరం కొనసాగేలా త్వరలో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంటామని పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. శనివారం కేరళ రాష్ట్రంలో ఆయన పర్యటించారు. కేరళ, తెలంగాణ టూరిజం శాఖలు కలసి పనిచేయాలన్న శ్రీనివాస్‌గౌడ్ సూచన మేరకు కేరళ పర్యాటక మంత్రి సురేంద్రన్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రాచీన కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నామని తెలిపారు. కేరళ రాష్ట్ర పండుగ ఓనంను తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. కేరళ–తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయని, మలయాళీల సంస్కృతి, సంప్రదాయాలను తెలంగాణ రాష్ట్రంలో ఎంతో గౌరవిస్తున్నామని వివరించారు. -
ఇక వైఎస్సార్ సెంట్రల్ పార్క్
సాక్షి, విశాఖపట్నం: నిరీక్షణ ఫలించింది. సుదీర్ఘ పోరాటం అనంతరం విశాఖ నగర సిగలో ఉన్న సిటీ సెంట్రల్ పార్కుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరు పెట్టేందుకు మార్గం సుగమమైంది. మంత్రులు, పార్టీ ముఖ్య నేతల చేతుల మీదుగా సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఈ పార్కు నామకరణం జరగనుంది దీంతోపాటు పార్కులో వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకూ మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక ఉన్న పాత జైలును పడగొట్టి ఆరిలోవలో కొత్త జైలును ఏర్పాటు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణం ఉన్న స్థలంలో ఏం నిర్మించాలన్నదానిపై ఎన్నో ఆలోచనలొచ్చాయి. షాపింగ్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ లేదా పరిశ్రమలకు ఇవ్వాలని వచ్చిన ప్రపోజల్స్ ప్రభుత్వం ముందుంచారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మాత్రం.. విశాఖ నగరం నడిబొడ్డులో అంతటి విశాల స్థలం దొరకడం గగనమనీ.. ఆ ప్రాంతంలో నగర వాసులకు ఆహ్లాదాన్ని పంచేలా సుందరమైన పార్కు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మరణించారు. 2011లో అప్పటి అర్బన్ డెవలప్మెంట్ బాడీ వైస్ ఛైర్మన్ కోన శశిధర్ ఆ పార్కుకి వైఎస్సార్ పార్క్‌గా నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు పార్కులో రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రకటించారు. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఆ రెండు నిర్ణయాలను తొక్కిపెట్టేసింది. రాజ కీయ కుట్రలతో వైఎస్సార్ పేరు పెట్టకుండా 2016లో వైజాగ్ సిటీ సెంట్రల్ పార్క్‌గా నామకరణం చేస్తూ ప్రారంభించారు. ప్రైవేట్ పార్కు దిశగా... మరోవైపు పార్కు ప్రారంభమైన కొద్ది నెలల్లోనే విశేష ఆదరణ లభించింది. దీంతో సెంట్రల్ పార్కును ప్రైవేట్ పరం చెయ్యాలని టీడీపీ మంత్రులు కుట్రలు పన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వామపక్షాలు పోరాటం చెయ్యడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఫలించనున్న అవంతి కృషి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటక శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అవంతి శ్రీనివాస్ గత నెలలో జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. వైజాగ్ సెంట్రల్ పార్కు పేరును.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సెంట్రల్ పార్కుగా నామకరణం చెయ్యాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పేరు మార్పునకు సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చెయ్యాలని అధికారులను మంత్రి అవంతి ఆదేశించారు. దీనికి సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఆయన ఆదేశాలు, కృషి ఫలితంగా సోమవారం నుంచి పార్కు పేరు మారనుంది. వైఎస్సార్ జయంతి సందర్భంగా మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చేతుల మీదుగా సాయంత్రం 4.30 గంటలకు ఈ పార్కు నామకరణం జరగనుంది. దీంతో పాటు పార్కులో 11 అడుగుల వైఎస్సార్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. -
నిషేధం అమలయ్యేనా..?
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలను నిషేధించాలని మంత్రి కేటీఆర్ ఆదేశం మున్సిపాలిటీల్లో నిర్దిష్ట ఆంక్షల రూపకల్పన పాలిథిన్ కవర్ల వాడకాన్నే అరికట్టలేని స్థితిలో మున్సిపాలిటీలు మంచిర్యాల : ఎంపీ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెపుతూ అడుగడుగునా ఫ్లెక్సీలు.. మంత్రి పర్యటనకు వస్తున్నారంటే నాయకులు ఉన్నా లేకపోయినా ఫ్లెక్సీలు మాత్రం స్వాగతం చెపుతాయి. పెళ్లిళ్లు, శుభాకార్యాలకు అభినందనలు మొదలు మరణించిన వారికి సంతాపాలు కూడా – మిగతా 2లోu ఫ్లెక్సీలతోనే చెప్పే ఆనవాయితీ వచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఇటీవల కరీంనగర్లో చేసిన ‘ఫ్లెక్సీలపై నిషేధం’ ప్రకటన చర్చనీయాంశమైంది. పర్యావరణానికి హాని కలిగించే ఫ్లెక్సీలను ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడాన్ని కొత్త సంవత్సరం నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అంటే జనవరి ఒకటి నుంచి మున్సిపాలిటీల అనుమతి లేకుండా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను సిబ్బంది నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తారన్న మాట. ఈ ఫ్లెక్సీలను ఏ ర్పాటు చేసే వారిపై కేసులు నమోదు చేసేందుకు కూడా విధివిధానాలను రూపొందిస్తున్నట్లు స మాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలోని మంచిర్యా ల, బెల్లంపల్లి, మందమర్రి మున్సిపాలిటీలలో ఫ్లెక్సీలపై యుద్ధానికి కమిషనర్లు సిద్ధమవుతున్నారు. అయితే.. పర్యావరణానికి పెను ముప్పు గా పరిణమించిన పాలిథిన్ కవర్లపై ఇప్పటికే ఆం క్షలు ఉన్నప్పటికీ అతి తక్కువ మైక్రాన్లు గల ప్రమాదకరమైన నలుపు, తెలుపు పాలిథిన్ కవర్లను జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫ్లెక్సీలపై ఆంక్షలు, నిషేధం ఏ విధంగా అమలు చేస్తారో చూడాల్సిందే..! పర్యావరణ హరణ... : ఫ్లెక్సీల ఏర్పాటు ప్ర క్రియ పదేళ్లలో తీవ్రంగా పెరిగిపోయింది. దుకాణాల బోర్డులు మొదలుకొని అన్ని వేడుకలకు, సమావేశాలకు ఫ్లెక్సీలు తప్పనిసరిగా మారిపోయాయి. ఇక రాజకీయ నాయకులు వస్తే పట్ట ణం, గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. ఇటీవలి కాలంలో జన్మదిన శుభాకాంక్షల ఫ్లెక్సీలు అడ్డగోలుగా ఏర్పాటు చే స్తున్నారు. అయితే.. రహదారులకు అడ్డంగా, చౌరస్తాల్లో వీటిని ఉంచడంతో పట్టణాల సుందరీకరణ దెబ్బతింటోంది. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా నగరానికి, పట్టణాలకు వస్తే స్వాగత ఫ్లెక్సీలు అడ్డగోలుగా ఏర్పాటు చేసి నానా హంగామ చేస్తుంటారు. ఒక ఫ్లెక్సీ 250 మైక్రాన్ల మందం ఉండటంతో ఇది భూమి లో కరిగిపోవడం కష్టం. దీంతోపాటు వీటికి ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణానికి విఘాతం కలిగిస్తాయని భావించి ప్రభుత్వం వాటిని నిషేధించాలనే నిర్ణయానికి వచ్చింది. పక్కాగ అమలయ్యేనా.. : పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో భూమిలో కరిగిపోని పాలిథిన్ కవర్లను దేశ వ్యాప్తంగా ప్రభుత్వం నిషేధించిం ది. రాష్ట్రంలో కూడా ఈ నిషేధం అమలులో ఉన్నప్పటికీ, జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలిథిన్ కవర్ల తయారీ, వాడకం ఆగలేదు. ప్రమాదం త క్కువగా ఉండే 40 మైక్రాన్లకు పైబడిన పాలిథిన్ కవర్లను మాత్రమే వినియోగించాలన్న నిబంధనలను అక్కడక్కడ మాత్రమే పాటిస్తున్నారు. పట్టణాల్లో చెత్తా చెదారం, మురుగు కాలువల్లో చూ స్తుంటే సింహభాగం పాలిథిన్ సంచులే ఉంటా యి. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలపై నిషేధం ఎంత వరకు అమలవుతుందనే ప్రశ్న అంతటా వినిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యమే ఎక్కువ కాగా, ఫ్లెక్సీల వినియోగంలో కూడా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల పాత్రే ఎక్కువ. ఈ తరుణంలో ఫ్లెక్సీల నిషేధం ఎంతవరకు అమలవుతుందో చూడాలి. యూనిట్లకు దెబ్బ.. : మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, లక్సెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లలో కలిపి ఫ్లెక్సీల తయారీ యూనిట్లు 16 ఉన్నాయి. ఇందులో 13 మంచిర్యాల జిల్లాలోనే ఉండడం గమనార్హం. ఈ యూనిట్ల మీద 300ల కు పైగా కుటుంబాలు ఆధారపడి ఉపాధి పొందుతున్నట్లు ఫ్లెక్సీ యూనిట్ల సంఘం చెబుతోంది. యజమానులతోపాటు అందులో పనిచేసే ఆపరేటర్లు, వెల్డర్లు, డిజైనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే పనివారందకీ ఇవే జీవనాధారం. వీటిని నిషేధిం చడంతో యూనిట్లలో పని చేసేవారు ఉపాధి కో ల్పోవాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఫ్లెక్సీ యూనిట్ల సంఘం తరఫున కోర్టును ఆశ్రయించారు. ‘అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని జనవరి 1 నుంచి నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, మంచిర్యాల మున్సిపాలిటీలో ఇప్పటికే అమలు చేస్తున్నామని’ మున్సిపల్ కమిషనర్ వెంకన్న తెలిపారు.