రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీలను నిషేధించాలని మంత్రి కేటీఆర్ ఆదేశం
మున్సిపాలిటీల్లో నిర్దిష్ట ఆంక్షల రూపకల్పన
పాలిథిన్ కవర్ల వాడకాన్నే అరికట్టలేని స్థితిలో మున్సిపాలిటీలు
మంచిర్యాల : ఎంపీ పుట్టిన రోజుకు శుభాకాంక్షలు చెపుతూ అడుగడుగునా ఫ్లెక్సీలు.. మంత్రి పర్యటనకు వస్తున్నారంటే నాయకులు ఉన్నా లేకపోయినా ఫ్లెక్సీలు మాత్రం స్వాగతం చెపుతాయి. పెళ్లిళ్లు, శుభాకార్యాలకు అభినందనలు మొదలు మరణించిన వారికి సంతాపాలు కూడా – మిగతా 2లోu ఫ్లెక్సీలతోనే చెప్పే ఆనవాయితీ వచ్చింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు ఇటీవల కరీంనగర్‌లో చేసిన ‘ఫ్లెక్సీలపై నిషేధం’ ప్రకటన చర్చనీయాంశమైంది. పర్యావరణానికి హాని కలిగించే ఫ్లెక్సీలను ఇష్టానుసారంగా ఏర్పాటు చేయడాన్ని కొత్త సంవత్సరం నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అంటే జనవరి ఒకటి నుంచి మున్సిపాలిటీల అనుమతి లేకుండా ఏర్పాటు చేసే ఫ్లెక్సీలను సిబ్బంది నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తారన్న మాట. ఈ ఫ్లెక్సీలను ఏ ర్పాటు చేసే వారిపై కేసులు నమోదు చేసేందుకు కూడా విధివిధానాలను రూపొందిస్తున్నట్లు స మాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలోని మంచిర్యా ల, బెల్లంపల్లి, మందమర్రి మున్సిపాలిటీలలో ఫ్లెక్సీలపై యుద్ధానికి కమిషనర్లు సిద్ధమవుతున్నారు. అయితే.. పర్యావరణానికి పెను ముప్పు గా పరిణమించిన పాలిథిన్ కవర్లపై ఇప్పటికే ఆం క్షలు ఉన్నప్పటికీ అతి తక్కువ మైక్రాన్లు గల ప్రమాదకరమైన నలుపు, తెలుపు పాలిథిన్ కవర్లను జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫ్లెక్సీలపై ఆంక్షలు, నిషేధం ఏ విధంగా
అమలు చేస్తారో చూడాల్సిందే..!
పర్యావరణ హరణ... : ఫ్లెక్సీల ఏర్పాటు ప్ర క్రియ పదేళ్లలో తీవ్రంగా పెరిగిపోయింది. దుకాణాల బోర్డులు మొదలుకొని అన్ని వేడుకలకు, సమావేశాలకు ఫ్లెక్సీలు తప్పనిసరిగా మారిపోయాయి. ఇక రాజకీయ నాయకులు వస్తే పట్ట ణం, గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ కార్యకర్తలు, అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. ఇటీవలి కాలంలో జన్మదిన శుభాకాంక్షల ఫ్లెక్సీలు అడ్డగోలుగా ఏర్పాటు చే స్తున్నారు. అయితే.. రహదారులకు అడ్డంగా, చౌరస్తాల్లో వీటిని ఉంచడంతో పట్టణాల సుందరీకరణ దెబ్బతింటోంది. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైనా నగరానికి, పట్టణాలకు వస్తే స్వాగత ఫ్లెక్సీలు అడ్డగోలుగా ఏర్పాటు చేసి నానా హంగామ చేస్తుంటారు. ఒక ఫ్లెక్సీ 250 మైక్రాన్ల మందం ఉండటంతో ఇది భూమి లో కరిగిపోవడం కష్టం. దీంతోపాటు వీటికి ఉపయోగించే రసాయనాల వల్ల పర్యావరణానికి విఘాతం కలిగిస్తాయని భావించి ప్రభుత్వం వాటిని నిషేధించాలనే నిర్ణయానికి వచ్చింది.
పక్కాగ అమలయ్యేనా.. : పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంతో భూమిలో కరిగిపోని పాలిథిన్ కవర్లను దేశ వ్యాప్తంగా ప్రభుత్వం నిషేధించిం ది. రాష్ట్రంలో కూడా ఈ నిషేధం అమలులో ఉన్నప్పటికీ, జిల్లాలోని మున్సిపాలిటీల్లో పాలిథిన్ కవర్ల తయారీ, వాడకం ఆగలేదు. ప్రమాదం త క్కువగా ఉండే 40 మైక్రాన్లకు పైబడిన పాలిథిన్ కవర్లను మాత్రమే వినియోగించాలన్న నిబంధనలను అక్కడక్కడ మాత్రమే పాటిస్తున్నారు. పట్టణాల్లో చెత్తా చెదారం, మురుగు కాలువల్లో చూ స్తుంటే సింహభాగం పాలిథిన్ సంచులే ఉంటా యి. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలపై నిషేధం ఎంత వరకు అమలవుతుందనే ప్రశ్న అంతటా వినిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రాబల్యమే ఎక్కువ కాగా, ఫ్లెక్సీల వినియోగంలో కూడా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల పాత్రే ఎక్కువ. ఈ తరుణంలో ఫ్లెక్సీల నిషేధం ఎంతవరకు అమలవుతుందో చూడాలి.
యూనిట్లకు దెబ్బ.. : మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, లక్సెట్టిపేట, చెన్నూరు, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లలో కలిపి ఫ్లెక్సీల తయారీ యూనిట్లు 16 ఉన్నాయి. ఇందులో 13 మంచిర్యాల జిల్లాలోనే ఉండడం గమనార్హం. ఈ యూనిట్ల మీద 300ల కు పైగా కుటుంబాలు ఆధారపడి ఉపాధి పొందుతున్నట్లు ఫ్లెక్సీ యూనిట్ల సంఘం చెబుతోంది. యజమానులతోపాటు అందులో పనిచేసే ఆపరేటర్లు, వెల్డర్లు, డిజైనర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే పనివారందకీ ఇవే జీవనాధారం. వీటిని నిషేధిం చడంతో యూనిట్లలో పని చేసేవారు ఉపాధి కో ల్పోవాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర ఫ్లెక్సీ యూనిట్ల సంఘం తరఫున కోర్టును ఆశ్రయించారు. ‘అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని జనవరి 1 నుంచి నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, మంచిర్యాల మున్సిపాలిటీలో ఇప్పటికే అమలు చేస్తున్నామని’ మున్సిపల్ కమిషనర్ వెంకన్న తెలిపారు.
నిషేధం అమలయ్యేనా..?
Published Sat, Dec 31 2016 10:46 PM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM
Advertisement
Advertisement