బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి
టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే భజనపరులే..
హన్మకొండ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే పట్టభద్రులు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయూలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. హన్మకొండ తారా గార్డెన్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులు కావాలా.. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి భజనపరుల జాబితాలో చేరుస్తారో.. మేథావులు ఆలోచించాలని అన్నా రు. రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని, సీఎం కేసీఆర్ ఎవరినీ లెక్క చేయడం లేదని, మంత్రులను కూడా దగ్గరకు రానివ్వడం లేదని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలి పిస్తే కుటుంబ పాలన ముందు మోకరిల్లుతారని.. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే విధాన మండలిలో ప్రజల గొంతుకలవుతారన్నారు.
పట్టభద్రులైన ఓటరు మేథావులు ఆలోచించి తమ విచక్షణ మేరకు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ మాటెత్తని తుమ్మల నాగేశ్వర్‌రావును, ఉద్యమకారులపై దాడులు, లాఠీచార్జి చేయిం చిన మహేందర్‌రెడ్డిని, వరంగల్‌లో జరిగిన టీడీపీ మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేస్తే చంద్రబాబుపైనే ఎదురు తిరిగి ఆంధ్రప్రదేశ్‌ను విభజించవద్దని, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను మంత్రులుగా చేశారని దుయ్యబట్టారు. విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలపైన గొంతును వినిపించే బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలి పించాలని కోరారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి చెందిన సీబీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఘట్‌కేసర్ మండలం కొర్రెంల శివారులో సర్వే నం.840లో రూ.1.20 కోట్ల విలువ చేసే ఎకరం స్థలాన్ని హైదరాబాద్-హన్మకొండ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఎకరం స్థలాన్ని ఆక్రమించారన్నారు.
ఈ సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్నామన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, నగర అధ్యక్షుడు చింతాకుల సునీల్, డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌రావు, రావు పద్మ, డాక్టర్ విజయచందర్‌రెడ్డి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, మందాడి సత్యనారాయణరెడ్డి, దొంతి దేవేందర్‌రెడ్డి, రావుల కిషన్, చాడా శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆలోచించి.. ఓటు వేయూలి
Published Sat, Mar 21 2015 12:59 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement