'సంస్కారహీనంగా కేసీఆర్ విమర్శలు'
హైదరాబాద్: పునర్‌విభజన బిల్లుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తెలిపారు. అప్పుడు బిల్లుకు అంగీకరించి, ఇప్పుడు వస్తున్న సమస్యలను బీజేపీపైనా, మోడీపైనా నెడుతున్నారని విమర్శించారు. బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
కేంద్రంతో కలిసి పనిచేయాలని ఎవ్వరైనా కోరుకుంటారని, కాని దీనికి విరుద్దంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఆక్షేపించారు. ఎంఐఎం పార్టీతో టీఆర్‌ఎస్‌కు సఖ్యత ఏర్పడ్డ తర్వాత బీజేపీపై అయినదానికీ, కానిదానికీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని సంస్కారహీనంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
గవర్నర్‌కు అధికారాల విషయంలో ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. తన కుటుంబం తప్ప మరెవ్వరూ తెలంగాణకు అనుకూలంగా లేరనే తప్పుడు ప్రచారాన్ని కేసీఆర్ చేస్తున్నారన్నారు.