Indecent Comments
-
ఆ మాటలనడానికి నోరెలా వచ్చింది
సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి, ఎంపీ నవనీత్ కౌర్, నటీమణులు రమ్యకృష్ణ, కవిత వంటి వారు రోజాకు మద్దతుగా నిలిచారు. రోజా గురించి ఆ మాటలనడానికి నోరెలా వచ్చిందని మండిపడ్డారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు తెలుగు సినిమాల్లో నటించిన నటి, ఎంపీ (మహారాష్ట్ర అమరావతి లోక్‌సభ నియోజకవర్గం) నవనీత్ కౌర్ బండారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజాకు మద్దతుగా ఆమె తెలుగులో మాట్లాడుతూ వీడియో విడుదల చేశారు. రోజాకు దేశంలోని మహిళా లోకమంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ‘మహిళా ప్రజా ప్రతినిధిపై ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గులేదా? నీకు ఇంటిలో భార్య, కూతురు, సోదరి వంటి వాళ్లు ఎవ్వరూ లేరా? ఇంత నీచంగా మాట్లాడటానికి నోరెలా వచ్చింది? తెలుగు అమ్మాయిలాగా తెలుగులో మాట్లాడుతుంది, తెలుగు సినిమాల్లో పని చేసింది అంటూ ఏపీ, తెలంగాణ ఎంపీలు నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు. ఎంతో మంది అగ్ర హీరోలతో పని చేసి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన రోజాపై ఇంత దిగజారి మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం కావాలి’ అంటూ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు రాజకీయాలు ముఖ్యమా లేక తెలుగు మహిళల గౌరవం ముఖ్యమా అన్నది తేల్చుకోవాలని అన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఖండించాలి: కవిత తెలుగుదేశం పార్టీ నేతలు మహిళలపై దిగజారి మాట్లాడుతున్నారని సినీ నటి, తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా నేత కవిత ధ్వజమెత్తారు. మహిళా మంత్రి రోజాపై బండారు సత్యానారాయణ అత్యంత హేయంగా మాట్లాడారని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. దరిద్రపు మాటలు ఎలా మాట్లాడారో తెలియడంలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు రాజకీయాలను ఇంతలా దిగజారుస్తారనుకోలేదన్నారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత నీచంగా మాట్లాడతారా?: రమ్యకృష్ణ భారత మాతాకి జై అని గర్వంగా చెప్పుకొనే మన దేశంలోఒక మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ సినీ నటి రమ్యకృష్ణ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్ తో సంబంధం లేకుండా బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. ఓ మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని చెప్పారు. నీచమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యానారాయణను క్షమించకూడదన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలి అల్లూరి జిల్లాలో మహిళల నిరసన.. కొవ్వొత్తుల ర్యాలీ సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): పర్యాటకశాఖ మంత్రి రోజాను అసభ్యకరంగా దూషించిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. బండారు సత్యనారాయణ వైఖరిని ఖండిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యాన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. బండారు ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మంత్రి రోజాతోపాటు మహిళా సమాజానికి బండారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న బండారు సత్యనారాయణకు టీడీపీ నేతలు మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. బండారుపై కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీకే చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలో మహిళా మున్సిపల్ కమిషనర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం, చింతమనేని ప్రభాకర్ ఏకంగా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేయడం వంటి దారుణమైన ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఎస్.రాంబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, పాడేరు మార్కెట్ కమిటీ చైర్మన్ కూతంగి సూరిబాబు, పలువురు నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, మంత్రి రోజాను బండారు సత్యనారాయణ అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ పాడేరులో కొవ్వొత్తులతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పలువురు నేతలు ర్యాలీ నిర్వహించారు. -
ప్రధాని మోదీపై అసభ్యకరమైన కామెంట్లు.. సస్పెన్షన్ వేటు
లక్నో: దేశ ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశారు అధికారులు. ఉత్తర ప్రదేశ్.. కాన్పూర్ క్రైమ్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు అజయ్ గుప్తా అనే కానిస్టేబుల్. ప్రధాని నరేంద్ర మోదీపై, ఓ మహిళా ఐఏఎస్ అధికారిణిపై అసభ్యకరమైన ట్వీట్లు, రీ ట్వీట్లు చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో అతని ట్వీట్లు స్క్రీన్ షాట్ల రూపంలో బాగా వైరల్ అయ్యాయి. అలా విషయం ఉన్నతాధికారుల దృష్టితో వెళ్లింది. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అధికారులు.. దర్యాప్తునకు ఆదేశించారు. ఇదిలా ఉంటే.. పంద్రాగస్టు సందర్భంగా పోలీస్ మెడల్ కోసం తన పైస్థాయి అధికారుల నుంచి డీజీపీ కార్యాలయం స్థాయి వరకు నిలదీస్తూ ట్విటర్లో పోస్టులు చేశాడు అజయ్ గుప్తా. ఈ క్రమంలో అతని పాత ట్వీట్ల బండారం బయటపడింది. దీంతో అతను తన అకౌంట్‌ను డిలీట్ చేయగా.. అప్పటికే అభ్యంతకర ట్వీట్ల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. ‘‘ప్రధాని మోదీకి వ్యతిరేకంగా అతను చేసిన కొన్ని పోస్టులు మరీ మితిమీరి ఉన్నాయి. పోలీస్ సిబ్బంది అనే స్పృహ లేకుండా పోస్టులు చేశాడు. ఇది ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనే. డిపార్టమెంటల్ ఎంక్వైరీకి ఆదేశించాం అని పోలీస్ కమిషనర్ బీపీ జోగ్దంద్ తెలిపారు. ఇదీ చదవండి: తాగొద్దు అన్నందుకు ఇంటి ఓనర్ హత్య.. ఆపై సెల్ఫీ!! -
అఖిలేష్ నోట అసభ్యకరమైన పదాలు.. సీఎం యోగి మందలింపు
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం ఆసక్తికర పరిణామాలు.. అదీ వాడీవేడిగా కొనసాగాయి. ప్రతిపక్ష నేత, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ నోటి నుంచి అసభ్య పదజాలం వెలువడగా.. జోక్యం చేసుకున్న సీఎం యోగి ఆయన్ని తీవ్రంగా మందలించారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అధికార-ప్రతిపక్ష నేతల మాటల యుద్ధంతో బుధవారం అట్టుడికిపోయింది. తన హయాంలో జరిగిన అభివృద్ధినే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చూపించుకుంటోందని అఖిలేష్ పదే పదే ప్రకటించుకున్నారు. దీనికి కౌంటర్‌గా డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చేసిన వ్యాఖ్యలతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్ యాదవ్.. ఒకానొక టైంలో సభలోనే అనుచిత వ్యాఖ్యలు చేశారు. అఖిలేష్ అధికారంలో ఉన్నప్పుడు.. తన పాలన గురించి గొప్పగా చెప్పుకునేవారు. అదే నిజమైతే ఆయన పార్టీని జనాలు.. ఎన్నికల్లో ఊడ్చిపడేసేవాళ్లు కాదు కదా! అని మౌర్య వ్యాఖ్యానించారు. అలాగే తన హయాంలో సంక్షేమ పథకాల గురించి అఖిలేష్ పదే పదే చెప్పుకుంటున్నారని, దీనికి ఆయనకు చికిత్స అవసరమంటూ వ్యాఖ్యానించారు. రోడ్లు, మెట్రో, ఎక్స్‌ప్రెస్‌వే.. ఇవన్నీ సైఫాయ్‌లోని మీ భూములు అమ్మి కట్టించారా? అంటూ మండిపడ్డారు మౌర్య. ఈ కామెంట్లతో చిర్రెత్తుకొచ్చిన అఖిలేష్ యాదవ్.. ఒక్కసారిగా అసభ్య పదజాలంతో మౌర్యపై విరుచుకుపడ్డాడు. దీంతో జోక్యం చేసుకున్న సీఎం యోగి ఆదిత్యానాథ్.. అఖిలేష్‌ను మందలించారు. तुमने राशन के लिए पैसे क्या अपने पिता जी से लेकर बाँटे …? फ्लावर समझा है क्या, फायर हैं फायर #AkhileshYadav #kpmaurya समाजवादी पार्टी #KeshavPrasadMaurya #BJP pic.twitter.com/kD8GJT2uFb — parasmudgal (@Spamudgal786) May 26, 2022 ‘‘సభలో అదీ గౌరవ సభ్యుడ్ని ఉద్దేశించి అలా మాట్లాడడం ఎంతమాత్రం సరికాదు. ఇక్కడ విషయం సైఫాయ్ గురించి కాదు. అభివృద్ధి పనులు చేయడం.. పర్యవేక్షించడం ప్రభుత్వంగా మా విధి. సంక్షేమ పనులను, అభివృద్ధిని ప్రకటించుకునే హక్కు మాకు కూడా ఉంది. డిప్యూటీ సీఎం ఇదే విషయాన్ని చెప్పదల్చుకున్నారు. ఆయన ఏం చెప్తున్నారో మీరు ముందుగా వినాల్సింది. ప్రతిపక్ష సభ్యులు చాలామంది చేసే తప్పు ఇదే. ఇది అంగీకరించాల్సి విషయం. అంతేగానీ.. అంతగా ఉద్రేకపడాల్సిన అవసరం లేదు. సభలో సభ్యతతో వ్యవహరిస్తే మంచిది అని మందలించారు. అంతేకాదు సభ రికార్డుల నుంచి అఖిలేష్ వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా స్పీకర్ సతీష్ మహానాకు సీఎం యోగి రిక్వెస్ట్ చేశారు. అంతకు ముందు రోజు(మంగళవారం) అసెంబ్లీలో ఎస్సీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చేసిన బాయ్స్ విల్ బాయ్స్ కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. అత్యాచారాలకు మరణశిక్ష విధించాలన్న వాదనను వ్యతిరేకిస్తూ.. అబ్బాయిలు అబ్బాయిలే.. కొన్నిసార్లు తప్పులు జరుగుతుంటాయి అంటూ ములాయం వ్యాఖ్యలు చేశారు. అయితే యూపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ అసెంబ్లీ సమావేశాల్లో అఖిలేష్ వ్యాఖ్యలకు.. సీఎం యోగి ‘ములాయం వ్యాఖ్యలను’ వ్యాఖ్యలను కౌంటర్‌గా తెరపైకి తెచ్చారు. -
కమిషనర్ కార్యాలయానికి జెడ్పీ సీఈఓ సరెండర్
సూర్యాపేట: సూర్యాపేట జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి ఆదివారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ సోమవారం కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గురుపూజోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి సీఈఓ ముఖ్య అతిథిగా హాజరై పలు వ్యా ఖ్యలు చేశారు. ‘ప్రభుత్వం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లడం దారుణం. కార్పొరేట్ సంస్థల లబ్ధికోసం పాఠశాలలు ప్రారంభించడం సిగ్గుచేటు. ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. కార్పొరేట్ స్కూళ్లు ఎప్పుడు తెరవాలం టే అప్పుడు.. ఎప్పుడు మూసేయాలంటే అప్పుడు ప్రభు త్వం విచ్చలవిడిగా అనుమతులు ఇస్తోంది. విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం, కార్పొరేట్ పాఠ శాలల యాజమాన్యాల కోసం పని చేస్తోంది. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉండదు. తెలంగాణలో అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన కార్పొ రేట్ స్కూళ్లను ప్రభుత్వం ప్రోత్సహించడం దారుణం. తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు దాపురించడం ఘోరం. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఉపాధ్యాయులు, మేధావులు కలసి వస్తే నా పదవికి రాజీనామాకైనా సిద్ధంగా ఉంటా’ అని ఆ సమావేశంలో ప్రేమ్‌కరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పలు సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లో ప్రసారం కావడంతో ఆయనను పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు : ప్రేమ్‌కరణ్‌రెడ్డి తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని, కార్పొరేట్ వ్యవస్థతో జరుగుతున్న నష్టాల గురించి ఓ బాధ్యత గల పౌరుడిగా మాట్లాడానే తప్ప తానేదో నేరం చేసినట్టు శిక్ష వేయడం సమంజసం కాదని జెడ్పీసీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా తాను మాట్లాడిన మొత్తం ప్రసంగాన్ని ప్రసారం చేయకుండా కేవలం ఒకటి రెండు అంశాలను తీసుకొని ప్రచారం చేయడం విచిత్రంగా ఉందన్నారు. కార్పొరేట్ వ్యవస్థ ఏ రకంగా తయారైందో చెబుతూ, లక్షల ఫీజులు వసూలు చేసి విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని, నాటి సర్వేల్ గురుకుల పాఠశాలలో చదివిన ఎంతో మంది ఎలా ప్రయోజకులు అయ్యారో తెలిపానని పేర్కొన్నారు. విద్యారంగాన్ని ప్రక్షాళన చేసేందుకు ఉపాధ్యాయులు, మేధావులు కలసి వస్తే పిల్లల కోసం రాజీనామాకైనా సిద్ధమే అని చెప్పానన్నారు. ఒక వైపు థర్డ్‌వేవ్ వస్తుందని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నా, పాఠశాలలు ప్రారంభించడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికీ పది నుంచి 20 శాతం మంది పిల్లలే పాఠశాలలకు వస్తున్నారన్నారు. కరోనా విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయం పోలేదన్నారు. తన వ్యాఖ్యలపై కనీసం సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం కూడా కల్పించకపోవడం సరికాదన్నారు. -
మమత ప్రచారంపై ఈసీ నిషేధం
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడం, కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సోమవారం ఎన్నికల సంఘం స్పందించింది. 24 గంటల పాటు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిషేధం విధించింది. ఏప్రిల్ 12 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 13 రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. షోకాజ్ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో కీలక అంశాలను ఆమె కావాలనే దాటవేశారని వ్యాఖ్యానించింది. ఈసీ నిర్ణయంపై మమత తీవ్రంగా స్పందించారు. ఈ నిషేధం రాజ్యాంగవిరుద్ధమని, దీనిపై కోల్‌కతాలో నేడు(మంగళవారం) ధర్నా చేస్తానని ప్రకటించారు. ఈసీ నిష్పక్షపాక్షితపై తమకు మొదట్నుంచీ అనుమానాలున్నాయని టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. మమతపై విధించిన తాజా నిషేధంతో ఈసీ వేసుకున్న ముసుగు పూర్తిగా తొలగిపోయిందని, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మోదీ, షాల ఆదేశాల మేరకు పనిచేస్తోందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. -
మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు నమోదు
లక్నో: ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కారణంగా కాంగ్రెస్ నాయకురాలు అల్క లంబాపై కేసు నమోదైంది. ట్విటర్ వేదికగా ఓ వీడియోలో ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌లు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించట్లేదని ఆరోపిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ముస్లిం, దళిత కార్డులను ఉపయోగించి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. (లాక్డౌన్ ఎఫెక్ట్: స్వచ్ఛంగా మారుతున్న యమునా నది) 'బేటీ బచావో' అని నినదించిన మోదీ.. తన సొంత పార్టీలోని వ్యక్తులే ఆడపిల్లలపై ఆఘాయిత్యాలు చేశారన్న సంగతి మర్చిపోరాదన్నారు. ఉన్నావ్ అత్యాచార ఘటనలో మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ని దోషిగా పేర్కొంటూ.. మోదీ మొదలుపెట్టిన బేటీ బచావో కార్యక్రమాన్ని ఫ్లాప్ షోగా అభివర్ణించారు. భారతదేశ ఆడపిల్లలను రక్షించుకోవడంలో, బాధితులకు న్యాయం చేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. అల్క లంబా చేసిన వ్యాఖ్యలపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) లోని 504, 505 (1) (బి) మరియు 505 (2) సెక్షన్ల కింద లక్నోలోని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సోషల్ మీడియాలో అల్క లంబాకు వ్యతిరేకంగా బీజేపీ నేతల పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అయితే తనపై కేసు నమోదు కావడం పట్ల అల్క లంబా స్పందిస్తూ.. నిజానికి నేను మాట్లాడిన ఆ వీడియో ఏడాది క్రితం నాటిది. బీజేపీ భక్తులకు నాకు వ్యతిరేకంగా ఏమీ దొరకలేదేమో, అందుకే సంవత్సరం క్రితం నాటి వీడియోను తవ్వారు అంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. (ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్ ) -
వాట్సాప్‌లో విద్యార్థినులపై అశ్లీల సంభాషణ
ముంబై: విద్యార్థినులు, మహిళలపై అసభ్యకరమైన పోస్ట్‌లు, లైంగికపరమైన కామెంట్లు చేయటం సోషల్ మీడియాలో రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా మంబైలోని ఓ ఇంటర్నేషల్ స్కూల్ విద్యార్థులు తమ వాట్సాప్ గ్రూప్‌లో.. తమతోపాటు చదివే తోటి విద్యార్థినులను ఉద్దేశించి అశ్లీల పదజాలంతో సంభాషణలు సాగించారు. ఈ విషయం పిల్లల తల్లిదండ్రుల కంటపడగా వారు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈ విద్యార్థులంతా 13 నుంచి 14 ఏళ్ల వయస్సు కలవారు కావడం గమనార్హం. అదే విధంగా ఈ విద్యార్థులు ఆయా రంగాల్లో పేరుపొందిన ప్రముఖుల పిల్లలుగా తెలుస్తోంది. విద్యార్థుల వాట్సాప్ సందేశాలు పరిశీలించగా అవన్నీ ఒక కోడ్ భాషలో ఉన్నాయి. ‘విద్యార్థినులపై అత్యాచారం చేయాలి.. వారిని ఎలా హింసించాలి’ అని అర్థం వచ్చేవిధంగా వాట్సాప్ గ్రూప్‌లో సంభాషణ కొనసాగించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదిక పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నటుడు రోహిత్ రాయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘సమాజం అసలు ఎటుపోతుంది. ఒక తండ్రిగా నా పిల్లల పట్ల ఒకింత భయంగా ఉంద’ని పేర్కొన్నారు. -
సిగ్గుపడండి
చెల్లెల్ని కామెంట్ చేస్తే ఏ అన్న అయినా ఊరుకుంటాడా? ఎవ్వరూ ఊరుకోరు. అర్జున్ కపూర్ కూడా ఊరుకోలేదు. సవతి తల్లి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌పై కామెంట్ చేసిన ఓ వెబ్‌సైట్‌పై విపరీతమైన ఆగ్రహం ప్రదర్శించారు అర్జున్ కపూర్. శ్రీదేవి మరణం తర్వాత ఆమె కూతుళ్లు జాన్వీ, ఖుషీల విషయంలో అన్నగా బాధ్యతగా ఉంటున్నారు అర్జున్. శ్రీదేవి చనిపోయినప్పుడు షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని కొన్ని రోజులు జాన్వీ, ఖుషీలతోనే ఉన్నారు. ఇటీవల తండ్రి బోనీకపూర్‌తో కలసి జాన్వీ, ఖుషీ అన్నయ్య అర్జున్ కపూర్‌ను కలవడం కోసం అతని ఇంటికి వెళ్లారు. అర్జున్ ఇంటి నుంచి జాన్వీ బయటికి వస్తున్న ఫొటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి. ఓ వైబ్‌సైట్ అయితే జాన్వీ వేసుకున్న డ్రెస్‌పై అసభ్యకర కామెంట్స్‌ను పోస్ట్ చేసింది. అది చూసిన అర్జున్ కపూర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘‘ఇలాంటి పాయింట్‌ని హైలైట్ చేయడంతోనే అర్థం అవుతోంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి మీ వెబ్సైట్ ఎంతకైనా దిగజారతుందని. మీ కళ్లు కేవలం అక్కడికే (డ్రెస్ వైపే) వెళ్లాయంటే ఎంత షేమ్ఫుల్గా ఆలోచిస్తున్నారో ఊహించుకోండి. మన దేశంలో ఆడపిల్లల్ని చూసేది ఇలానేనా? వాళ్లను గౌరవించేది ఇలానేనా? సిగ్గుపడండి’’ అంటూ ట్వీటర్లో ఆ వెబ్‌సైట్‌పై కోపాన్ని ప్రదర్శించారు అర్జున్ కపూర్. చెల్లెళ్ల పట్ల అర్జున్ ఎంత బాధ్యతగా ఉంటున్నారో చెప్పడానికి ఈ ఒక్క ట్వీట్ చాలు. -
'సంస్కారహీనంగా కేసీఆర్ విమర్శలు'
హైదరాబాద్: పునర్విభజన బిల్లుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి తెలిపారు. అప్పుడు బిల్లుకు అంగీకరించి, ఇప్పుడు వస్తున్న సమస్యలను బీజేపీపైనా, మోడీపైనా నెడుతున్నారని విమర్శించారు. బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కేంద్రంతో కలిసి పనిచేయాలని ఎవ్వరైనా కోరుకుంటారని, కాని దీనికి విరుద్దంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఆక్షేపించారు. ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్కు సఖ్యత ఏర్పడ్డ తర్వాత బీజేపీపై అయినదానికీ, కానిదానికీ విమర్శలు చేస్తున్నారని అన్నారు. నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని సంస్కారహీనంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్‌కు అధికారాల విషయంలో ఇన్నాళ్లూ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. తన కుటుంబం తప్ప మరెవ్వరూ తెలంగాణకు అనుకూలంగా లేరనే తప్పుడు ప్రచారాన్ని కేసీఆర్ చేస్తున్నారన్నారు.