
జాన్వీ కపూర్, అర్జున్ కపూర్
చెల్లెల్ని కామెంట్ చేస్తే ఏ అన్న అయినా ఊరుకుంటాడా? ఎవ్వరూ ఊరుకోరు. అర్జున్ కపూర్ కూడా ఊరుకోలేదు. సవతి తల్లి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌పై కామెంట్ చేసిన ఓ వెబ్‌సైట్‌పై విపరీతమైన ఆగ్రహం ప్రదర్శించారు అర్జున్ కపూర్. శ్రీదేవి మరణం తర్వాత ఆమె కూతుళ్లు జాన్వీ, ఖుషీల విషయంలో అన్నగా బాధ్యతగా ఉంటున్నారు అర్జున్. శ్రీదేవి చనిపోయినప్పుడు షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని కొన్ని రోజులు జాన్వీ, ఖుషీలతోనే ఉన్నారు. ఇటీవల తండ్రి బోనీకపూర్‌తో కలసి జాన్వీ, ఖుషీ అన్నయ్య అర్జున్ కపూర్‌ను కలవడం కోసం అతని ఇంటికి వెళ్లారు. అర్జున్ ఇంటి నుంచి జాన్వీ బయటికి వస్తున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. ఓ వైబ్‌సైట్ అయితే జాన్వీ వేసుకున్న డ్రెస్‌పై అసభ్యకర కామెంట్స్‌ను పోస్ట్ చేసింది.
అది చూసిన అర్జున్ కపూర్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ‘‘ఇలాంటి పాయింట్‌ని హైలైట్ చేయడంతోనే అర్థం అవుతోంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి మీ వెబ్‌సైట్ ఎంతకైనా దిగజారతుందని. మీ కళ్లు కేవలం అక్కడికే (డ్రెస్ వైపే) వెళ్లాయంటే ఎంత షేమ్‌ఫుల్‌గా ఆలోచిస్తున్నారో ఊహించుకోండి. మన దేశంలో ఆడపిల్లల్ని చూసేది ఇలానేనా? వాళ్లను గౌరవించేది ఇలానేనా? సిగ్గుపడండి’’ అంటూ ట్వీటర్‌లో ఆ వెబ్‌సైట్‌పై కోపాన్ని ప్రదర్శించారు అర్జున్ కపూర్. చెల్లెళ్ల పట్ల అర్జున్ ఎంత బాధ్యతగా ఉంటున్నారో చెప్పడానికి ఈ ఒక్క ట్వీట్ చాలు.
Comments
Please login to add a commentAdd a comment