అరిగిపోయిన రికార్డు: బీజేఎల్పీ | G. Kishan Reddy slams governer narasimhan speech | Sakshi
Sakshi News home page

అరిగిపోయిన రికార్డు: బీజేఎల్పీ

Published Sat, Mar 11 2017 3:41 AM | Last Updated on Tue, Aug 21 2018 11:49 AM

అరిగిపోయిన రికార్డు: బీజేఎల్పీ - Sakshi

అరిగిపోయిన రికార్డు: బీజేఎల్పీ

సాక్షి, హైదరాబాద్‌: ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ చేసిన ప్రసంగం అరిగిపోయిన రికార్డులా ఉందని బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని సమస్యలు, ప్రజల ఆకాంక్షలను ఈ ప్రసంగం ప్రతిబింబించలేదని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాలులో ఆయన విలేకరులో మాట్లాడుతూ ఈ ప్రసంగం మేడిపండు చందంగా ఉందని, కాకిలెక్కలతో కూడుకుని ఉందని ధ్వజమెత్తారు. ఎన్నికల హామీల అమలుపై కార్యాచరణ గవర్నర్‌ ప్రసంగంలో లేదని అన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం ఏమి సాధించిందో గవర్నర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు కోటలు దాటుతున్నాయి కాని చేతలు ప్రగతిభవన్‌ను దాటడం లేదని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement