బీజేపీ భారీ విజయం.. కాషాయ నేతల సంబరాలు | BJP Big Win In Delhi Assembly Elections 2025, BJP Leaders Celebrating Victory Goes Viral | Sakshi
Sakshi News home page

BJP Win In Delhi Elections: బీజేపీ భారీ విజయం.. కాషాయ నేతల సంబరాలు

Published Sat, Feb 8 2025 11:53 AM | Last Updated on Sat, Feb 8 2025 1:21 PM

BJP Big WIn IN Delhi Assembly Elections

ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నికల కమిషన్‌ ట్రెండ్స్‌ ప్రకారం బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌(36) మార్క్‌ను దాటేసింది. దాదాపు 45 స్థానాల్లో బీజేపీ ముందంజలో కొనసాగుతోంది. మరికాసేపట్లో అధికారికంగా ఈసీ ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. దీంతో, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఢిల్లీలో అధికార ఆప్‌ ఆశలకు బీజేపీ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను నిజం చేస్తూ ఢిల్లీలో బీజేపీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. దాదాపు 45 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి ఏడు గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ రానున్నారు. పార్టీ అగ్ర నేతలతో మోదీ సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ బీజేపీ చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పూర్తి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. విజయం కోసం పార్టీ కార్యకర్తలు ఎంతో శ్రమించారు. ఢిల్లీ సమస్యల ఆధారంగా మేం ఎన్నికల్లో పోరాడాం. కానీ అరవింద్ కేజ్రీవాల్ సమస్యల నుంచి దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అవినీతికి పాల్పడిన కారణంగానే ఎన్నికల్లో కేజ్రీవాల్‌, సిసోడియా, అతిశి ఓటమిని చూడబోతున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఇదే సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిపై వీరేంద్ర సచ్‌దేవా కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం పోస్టుపై అగ్రనాయకత్వం నిర్ణయమే ఫైనల్. అది మాకు పెద్ద సమస్య కాదు. ముఖ్యమంత్రి ఎవరు అనేది హైకమాండ్‌ నిర్ణయిస్తుంది అంటూ కామెంట్స్‌ చేశారు.

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement