తెలంగాణ బిల్లును 100 శాతం గెలిపిస్తాం: రాజ్నాథ్ సింగ్ | Rajnath Singh assures of passing telangana bill in parliament | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లును 100 శాతం గెలిపిస్తాం: రాజ్నాథ్ సింగ్

Published Sat, Nov 2 2013 11:39 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

తెలంగాణ బిల్లును 100 శాతం గెలిపిస్తాం: రాజ్నాథ్ సింగ్ - Sakshi

తెలంగాణ బిల్లును 100 శాతం గెలిపిస్తాం: రాజ్నాథ్ సింగ్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో భారతీయ జనతాపార్టీ వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును వంద శాతం గెలిపిస్తామని తెలంగాణ బీజేపీ నేతలకు రాజనాథ్ సింగ్ తెలిపారు.తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు శనివారం ఉదయం న్యూఢిల్లీలో రాజ్నాథ్ సింగ్కు కలిశారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆ పార్టీ నేతలకు పైవిధంగా భరోసా  ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే తమ ప్రాంతం నుంచి 10 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపిస్తామని వారు రాజ్నాథ్కు హామీ ఇచ్చారు.  


నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ను బరిలో దింపేందుకు ఆమెను ఒప్పించాలని తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు రాజనాథ్కు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగదని ఇటీవల ప్రచారం జరగుతున్న విషయాన్ని రాజ్నాథ్ ఎదుట ఆ పార్టీ నేతలు వెల్లడించారు. ఎవరో మాట్లాడిని దాని గురించి పట్టించుకోవద్దని ఆయన తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలకు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement