వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ రథయాత్రలకు సిద్ధమైంది. వీలైనంత ఎక్కువ మంది ముఖ్య నేతలను భాగస్వాములను చేయడంతోపాటు.. తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజలను కలుసుకోవడానికి రథయాత్రలే ఉత్తమమనే నిర్ణయానికి వచి్చంది. నిరీ్ణత గడువు ప్రకారం 8 నెలల్లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ రూపాల్లో పార్టీ కార్యక్రమాల వేగం పెంచాలని రాష్ట్ర నేతలను జాతీయ నాయకత్వం ఆదేశించింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదు విడతలుగా చేపట్టిన ‘ప్రజా సంగ్రామయాత్ర’ ద్వారా ఇప్పటివరకు 56 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేశారు. మిగతా 63 స్థానాల్లో పాదయాత్ర నిర్వహించేంత సమ యం లేనందున.. రథయాత్రలకు బీజేపీ మొగ్గు చూపింది. ఇందుకోసం 5 ఎన్నికల రథాలను సిద్ధం చేస్తున్నారు.
ఒకే దఫాలో రాష్ట్రమంతా పూర్తయ్యేలా..
రాష్ట్రం మొత్తాన్ని ఒకే దఫా పూర్తి చేసేలా ఐదు వైపుల నుంచి ఐదు రథయాత్రలను నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయానికి వచ్చారు. ఈ యాత్రల రూట్లు, షెడ్యూల్‌పై చర్చించి త్వరలోనే తుదిరూపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు ఏప్రిల్ తొలివారంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల వారీగా కూడా రథయాత్రలు నిర్వహించనున్నారు. ప్రతి లోక్‌సభ స్థానంలో ఒక్కోరోజు ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధిలో ఈ యాత్రలు సాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటికి సంబంధించిన రూట్‌మ్యాప్‌లను కూడా త్వరలోనే ఖరారు చేయనున్నట్టు తెలిసింది.
మొత్తంగా రాష్ట్రంలోని ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలోని రెండేసి అసెంబ్లీ సీట్లలో సంజయ్ రథయాత్ర నిర్వహించేలా తుది షెడ్యూల్ సిద్ధం చేయనున్నట్టు సమాచారం. యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు ప్రాంతాల నుంచి ఒక్కో బృందం 11 జిల్లాల చొప్పున కవర్ చేసేలా ‘జన్‌విశ్వాస్’ రథయాత్రలను నిర్వహించారు. అదే తరహాలో తెలంగాణలోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ యాత్రలలో కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ జాతీయ నాయకులు పాల్గొనేలా పర్యటనల షెడ్యూల్‌లను తయారు చేస్తున్నారు.
సీనియర్లంతా రంగంలోకి..
కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అధినాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ఎన్నికల సమన్వయ బాధ్యతలను అమిత్‌షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్, స్మృతీ ఇరానీలకు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇకపై వరుసగా కర్ణాటక ప్రచారంలో పాల్గొనే బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ఇతర జాతీయనేతలు తెలంగాణలోనూ పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో , ఆ తర్వాత 10 ఉమ్మడి జిల్లాల్లో సభలు, ఏప్రిల్ చివర్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగసభతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నట్టు సమాచారం.
బీఆర్‌ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ..
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వెంటనే వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. వచ్చే ఆరు నెలల పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ.. బీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని రాష్ట్ర ముఖ్య నేతలకు అమిత్‌షా, నడ్డా స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ శ్రేణులంతా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ ప్రణాళికను, ఎన్నికల రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని.. రాష్ట్రంలోని ఇతర విపక్షాల తీరును ప్రజలకు వివరించి, బీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చాటాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బలమైన మోదీ ›ప్రభుత్వం, నాయకత్వం ఉన్నందున ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించినట్టు సమాచారం.
కలిసి సాగాల్సిందే..
రాష్ట్ర నాయకత్వం మొదలు గ్రామ స్థాయి వరకు ఎలాంటి రాగద్వేషాలకు అవకాశం ఇవ్వకుండా సమష్టిగా, కచి్చతమైన కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలని బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం మిషన్–90లో భాగంగా 90 సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేయాలని పేర్కొన్నట్టు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పారీ్టకి రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున.. తగిన వ్యూహాలతో, కచి్చతంగా గెలుపొందేలా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment