
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధిపై దృష్టి సారిస్తామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
కేంద్రమంత్రివర్గంలోకి తెలంగాణ బీజేపీ నుంచి ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం లభించింది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండిసంజయ్‌లు ఉన్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి వారికి సమాచారం వచ్చింది.
ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కేంద్రంలో సహాయ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. మంత్రిగా ఒక రోడ్డు మ్యాప్ తయారు చేసుకొని పనిచేస్తా. కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయి అనే దానికి ఇదే సంకేతం.వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రంగా పనిచేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment