తెలంగాణ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా భేటీ ముగిసింది.
ఢిల్లీ: తెలంగాణ బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా భేటీ ముగిసింది. తెలంగాణలో బీజేపీ బలోపేతం, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ, ఒడిషాలలో పార్టీ మరింత బలోపేతం అయ్యేలా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.
ఇందులో భాగంగా తెలంగాణలో సెప్టెంబర్ నెలలో కొంతమంది కేంద్ర మంత్రులు, అమిత్షా పర్యటించను, అక్టోబర్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్టీ ప్రయోజనాల కోసం విచ్చేయనున్నారు. వీటితో పాటు ఆయా రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షుల మార్పుపై కూడా ఆ పార్టీ కసరత్తులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. బేజేపీ నేతల భేటీపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.