రైతు సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు.
హైదరాబాద్: రైతు సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ నాయకులు గురువారం సచివాలయంలో ధర్నాకు దిగారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 791 కోట్ల ఇన్ ఫుట్ సబ్సిడీ అన్నదాతలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
కేసీఆర్ సర్కారు రైతులను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది.