తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల విభజనపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇష్టా రాజ్యంగా వార్డులను విభజించారని బీజేపీ నేతలు నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ కలిసిన వారిలో శాసనసభాపక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువులు బీజేపీ నేతలు ఉన్నారు.