governar
-
రేపు గవర్నర్‌ను కలవనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(బుధవారం) సాయంత్రం మర్యాదపూర్వకంగా కలవనున్నారు. కాగా, మంగళవారం గవర్నర్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఎల్లప్పుడూ ఆయన సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. -
గవర్నర్‌ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళసైను తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం కలిశారు. రాచకొండ పరిధిలో లాకప్‌డెత్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో రాజ్యాంగపరమైన స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న దాడులపై గవర్నర్‌కు వివరించామని తెలిపారు. తెలంగాణలో పోలీసులకు, టీఆర్ఎస్ నేతలకు తేడా లేదని వ్యాఖ్యానించారు. పోలీసులు.. టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆచరణలో లేదని శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు. చదవండి: తెలంగాణలో దళితుల ప్రాణాలకు విలువ లేదా? -
హత్యా బెదిరింపులు.. గవర్నర్ ఉక్కిరిబిక్కిరి
గవర్నర్ హోదా అంటే పూలపాన్పు కాదు.. పదునైన ముళ్లపై పాదరక్షలు లేని కాలినడకేనని తమిళనాడు గవర్నర్లకు తరచూ అనుభవం ఎదురవుతోంది. తాజాగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ సైతం అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకోలేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. చివరకు బదిలీ అయ్యేందుకు కూడా ఆయన సిద్ధమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలతో వరుస భేటీలపై ఆంతర్యమేమిటోనన్న ప్రశ్న తలెత్తుతోంది. సాక్షి, చెన్నై : వేర్వేరు రాష్ట్రాల వారు తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన వారిలో అధికశాతం కత్తిమీద సాము పరిస్థితిని ఎదుర్కొన్నారు. లౌక్యం తెలిసిన ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ప్రభుత్వంపై మింగుడు పడలేకపోయారు. ప్రస్తుత గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌కు సైతం అదే పరిస్థితులు ఎదరయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్ బిల్లుపై నిర్ణయం తీసుకోవడంలో గవర్నర్ జాప్యం చేయడంతో అధికార, ప్రతిపక్షాలు ఆయనపై ఒత్తిడి తెచ్చాయి. గవర్నర్ ఆమోదముద్ర కోసం వేచిచూడకుండా రిజర్వేషన్‌పై ప్రభుత్వం జీఓ జారీచేసింది. దీంతో మరో ఆలోచనకు తావివ్వకుండా విధిలేని పరిస్థితుల్లో గవర్నర్ ఆమోదించారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులోని ఏడుగురు శిక్షా ఖైదీల విడుదలపై గవర్నర్ ఇంకా తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. రెండేళ్లయినా ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని గవర్నర్‌ను సుప్రీంకోర్టు ఇటీవల తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వ అభీష్టంతో నిమిత్తం లేకుండా గవర్నరే రాష్ట్రంలోని యూనివర్సిటీల వీసీల నియామాకాన్ని చేశారు. ఈ వీసీల్లో కొందరు ప్రభుత్వంపై తిరుగుబాటు ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా అన్నావర్సిటీ వీసీ సూరప్ప, ప్రభుత్వం మధ్య ప్రత్యక్ష మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ కారణంగా గవర్నర్ పేరు కూడా రచ్చకెక్కింది. ఇలా తమిళనాడులో జరిగే అనేక వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం తెరపైకి రావడంపై కేంద్రం అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ బదిలీకి రంగం సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. పైగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో వివాదాల్లో చిక్కుకున్న బన్వరిలాల్ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వెళ్లేందుకా..కొనసాగేందుకా? అనేక అంశాల మధ్య నలుగుతున్న గవర్నర్ బన్వరిలాల్ ఇటీవల ఢిల్లీ వెళ్లారు. మూడు రోజులుగా ఢిల్లీలో తిష్టవేసి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి, పార్లమెంటు వ్యవహారాల మంత్రిని ఇప్పటికే కలిశారు. శుక్రవారం రాష్ట్రపతితో భేటీ అయ్యారు. గవర్నర్ అకస్మాత్తుగా ఢిల్లీ ప్రయాణం వెనుక కారణాలపై అన్వేషణ సాగుతోంది. బదిలీ కోసమా లేక కేంద్రంలో బదిలీ ఆలోచనలకు తెరదించి తమిళనాడులోనే కొనసాగేందుకా ఈ ఢిల్లీ పర్యటన అని చర్చ మొదలైంది. అన్నావర్సిటీ వీసీకి హత్యా బెదిరింపులు అన్నాయూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సూరప్ప హత్యాబెదిరింపులకు గురయ్యారు. అన్నా వర్సిటీకి ప్రత్యేక అంతస్థు కోరుతూ కేంద్రప్రభుత్వానికి ఆయన ఇటీవల లేఖ రాయడం కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కేంద్రానికి లేఖరాసిన ఆయనను వీసీ బాధ్యతల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు, అనేక వర్గాలు డిమాండ్ చేయడం ప్రారంభించాయి. రాష్ట్ర ప్రభుత్వం సైతం వీసీ అభ్యర్థనను వ్యతిరేకిస్తూ అన్నావర్సిటీకి ప్రత్యేక అంతస్తు అవసరం లేదని కేంద్రానికి లేఖరాసింది. ఈ వివాదాల నేపథ్యంలో వీసీ సూరప్పను తుపాకీతో కాల్చి చంపుతానని వీరప్పన్ అనే పేరుతో వర్సిటీకి ఒక ఉత్తరం చేరింది. చెన్నై కొట్టూరుపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్
సాక్షి, హైదరాబాద్: తమిళనాడుకు చెందిన బీజేపీ నేత డా.తమిళసై సౌందర్‌రాజన్ (58) తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా నియమితులై ప్రత్యేక గుర్తింపును పొందారు. తమిళనాడులో బీజేపీ కీలక నేతగా వ్యవహరిస్తున్న తమిళసై.. ప్రస్తుతం ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైద్య వృత్తి నుంచి వచ్చిన తమిళిసై అనతికాలంలోనే బీజేపీ మహిళా అగ్రనేతగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోలి గ్రామంలో 1961 జూన్2న కుమారి అనంతన్, కృష్ణ కుమారి దంపతులకు తమిళిసై జన్మించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2నే ఆమె జన్మదినం కావడం విశేషం. సౌందర్‌రాజన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. అనంతరం కొంత కాలంపాటు వైద్యురాలిగా సేవలందించారు. ఆమె భర్త సౌందర్‌రాజన్ కూడా తమిళనాడులో ప్రముఖ వైద్యుడే. కార్యకర్త నుంచి పార్టీ చీఫ్‌గా.. సౌందర్‌రాజన్ తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఆ పార్టీ తరఫున పార్లమెంట్‌కు కూడా ఎన్నికయ్యారు. కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీతో కొనసాగినప్పటికీ.. తమిళసై మాత్రం భిన్నంగా బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో మద్రాస్ మెడికల్ కళాశాలలో చదువుతున్న రోజుల్లో విద్యార్థిని నాయకురాలుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీలో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి అనేక పదవుల్లో పార్టీకి సేవలందించారు. 1999లో సౌత్ చెన్నై జిల్లా విద్యా విభాగం కార్యదర్శిగా, 2001లో రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, ఆ తరువాత 2007 పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, 2013లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. తాజాగా తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైయ్యారు. చదవండి: తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్ అన్నింటా ఓటమే.. సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం సౌందర్‌రాజన్‌కు రాలేదు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఘోర పరాజాయాన్ని చవి చూశారు. అనంతరం 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. గత ఎన్నికల్లో తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి డీఎంకే నేత కనిమొళిపై పోటీ చేసి 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
ముంపు ప్రాంతాల్లో ఏపీ గవర్నర్ ఏరియల్ సర్వే
సాక్షి, విజయవాడ: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను శనివారం గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. కృష్ణా నదిలో వరద ప్రవాహం, నీట మునిగిన లంక గ్రామాలను పరిశీలించారు. వరద నివారణ చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వరద పోటెత్తడంతో అధికారులు ఇప్పటికే హై అలర్డ్ ప్రకటించారు. వరద నేపథ్యంలో రెండు జిల్లాల్లోనూ సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పడు అంచనా వేస్తూ అధికారులు మందుజాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో మంత్రులు పర్యటించి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా జిల్లాలో 12 మంది గ్రామాలు నీట మునగడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు జిల్లాల్లోనూ ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బృందాలుగా ఏర్పడి బోట్ల ద్వారా సాయాన్ని అందిస్తున్నారు.వరద ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలతో పాటు మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. -
కోడ్ ఉండగా మెట్రో ఎలా ప్రారంభిస్తారు?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు మెట్రో రైలు నూతన మార్గాన్ని ఎలా ప్రారంభిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. మెట్రో రైలు నూతన మార్గాన్ని గవర్నర్ నరసింహన్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. కోడ్ అమల్లో ఉండగా ప్రారంభానికి గవర్నర్‌ను ఎలా ఆహ్వానిస్తారని, ఆయన ఎలా పాల్గొంటారని టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ కన్వీనర్ గోపిశెట్టి నిరంజన్ ప్రశ్నిం చారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం సీఈఓ రజత్‌కుమార్‌కు ఆ పార్టీ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ ఈ మేరకు మంగళవారం ఫిర్యాదు చేశారు. -
జస్టిస్ ఏకే సిక్రీ (సుప్రీంకోర్టు) రాయని డైరీ
యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం నుంచి యడ్యూరప్ప రాజీనామా వరకు గత రెండు రోజులుగా రాజకీయాలపై క్షణక్షణానికీ నాకు ఉత్కంఠభరితంగా గౌరవభావం పెరిగిపోతోంది! పాలిటిక్స్‌లోని గొప్పదనం ఇదేనేమో. బలం లేనివాళ్లు బలం చూపిస్తామంటారు. బలం అసలే లేనివాళ్లు ‘చూస్తాం. ఎలా చూపిస్తారో’ అంటారు! ఆ రోజు.. బాబ్డే, భూషణ్, నేను.. బెంచి మీద ఉన్నాం. ముకుల్ రొహత్గీ మా ఎదురుగా ఉన్నాడు. యడ్యూరప్ప లాయర్ అతను. ‘‘మిస్టర్ రొహత్గీ.. మీ క్లయింట్ తన బలాన్ని ఎలా నిరూపించుకుంటారు?’’ అని జస్టిస్ భూషణ్ ప్రశ్నించారు. అదే ప్రశ్న నన్నూ తొలుస్తోంది. బహుశా బాబ్డేని కూడా తొలుస్తూ ఉండాలి. రొహత్గీ అనాసక్తిగా చూశాడు. ప్రశ్న అడగడంలో మాకున్న కుతూహలం.. సమాధానం చెప్పడంలో అతడికి కొంచెం కూడా లేనట్లుంది! ‘‘బలాన్ని ఎలా నిరూపించుకుంటారని ప్రశ్నిస్తున్నారా? లేక, ఎలా బలాన్ని నిరూపించుకుంటారని ప్రశ్నిస్తున్నారా మిస్టర్ జస్టిస్’’ అన్నాడు రొహత్గీ. ‘‘ఏమిటి మీరనుకుంటున్న తేడా ఆ రెండింటికీ మిస్టర్ రొహత్గీ?!’’ అని భ్రుకుటి ముడిచారు జస్టిస్ బాబ్డే. ‘‘బలాన్ని ఎలా నిరూపించుకుంటారు? అంటే.. నిరూపణకు మీకేం అర్హత ఉందని ప్రశ్నించినట్లు. ‘ఎలా బలాన్ని నిరూపించుకుంటారు?’ అంటే నిరూపణకు అంత బలం మీకుందా అని ప్రశ్నించినట్లు’’ అన్నాడు రొహత్గీ. రాజకీయాల మీద మళ్లీ నాకు గౌరవం పెరిగిపోయింది.రొహత్గీ లాంటి లాయర్ని యడ్యూరప్ప పెట్టుకున్నందుకు! ‘‘నిరూపణకు.. అంత బలం మీకుందా అని అడగడమే నా ఉద్దేశం మిస్టర్ రొహత్గీ. ఎక్కడి నుంచి వస్తారు మీ క్లయింటుకు ఆ పదీ పరకా ఎమ్మెల్యేలు!’’ అన్నారు జస్టిస్ భూషణ్. రొహత్గీ నవ్వుతూ చూశాడు. కాన్ఫిడెన్స్ పీక్స్‌లోకి వెళ్లిపోతే కనిపించే నవ్వు అది. ‘‘ఎక్కడి నుంచైనా వస్తారు మిస్టర్ జస్టిస్. గాలిలోంచి నేరుగా ఫ్లోర్లోకే వచ్చేస్తారు’’ అన్నాడు రొహత్గీ! అంతే తప్ప, కాంగ్రెస్ నుంచి, జేడీఎస్ నుంచి అనలేదు!! మళ్లీ నాకు పాలిటిక్స్ మీద ఉత్కంఠభరితంగా గౌరవం పెరిగిపోయింది. ఆ రెండు పార్టీల్లోంచి ఎమ్మెల్యేలు ‘గాలి’కి కొట్టుకొచ్చేస్తారని ఎంత భావయుక్తంగా చెప్పాడు! రొహత్గీ తర్వాత సింఘ్వీ టర్న్ వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్‌ల లాయర్ అతను. ‘‘మీ వాదన ఏమిటి మిస్టర్ సింఘ్వీ?’’ అని అడిగారు జస్టిస్ బాబ్డే. ‘‘గవర్నర్ గాల్లోంచి చూసి భూమ్మీద బీజేపీ ఎమ్మెల్నేల్ని లెక్కేస్తున్నారు మిస్టర్ జస్టిస్. ఆయన్ని ఎవరైనా కిందికి దింపగలిగితే బాగుంటుంది’’ అన్నాడు సింఘ్వీ! అతడు కూడా రాజకీయాలపై నాకు ఏర్పడుతున్న గౌరవ భావాన్ని విపరీతంగా పెంచేశాడు. -మాధవ్ శింగరాజు -
గణతంత్ర దినోత్సవం..గవర్నర్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ శుభసమయంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎందరో అమరవీరులను, త్యాగమూర్తులను స్మరించుకుందామన్నారు. ఆ మహనీయుల ఆశయాల సాధనకు మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాల వారికి సమంగా అందాలని అన్నారు. బాధ్యత గల పౌరులుగా మనందరం సమిష్టిగా శ్రమించాలన్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధన లక్ష్యంతో అహర్నిశం, అనుక్షణం కృషి చేద్దామని చెప్పారు. -
గవర్నర్ ప్రభుత్వాలకు భజన చేస్తున్నారు
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ ప్రజలపక్షాన నిలబడకుండా.. ప్రభుత్వాల భజన చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. ఆయన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనన్నారు. పార్టీ మారిన వారితో ఓ వైపు గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒక పార్టీలో గెలిచి.. మరో పార్టీకి మారడం వ్యభిచారం కంటే పెద్ద తప్పు అని, పార్టీ మారిన వారిపై చర్యలు తీసుకోకుండా ఇలానే చూస్తూ కూర్చుంటే.. రానున్న రోజుల్లో ఓటు హక్కుని ఎవరు కూడా వినియోగించుకోరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసీ, రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతున్నా ప్రదాని మోడీ పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇతరపార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమించాలని పిలపునిచ్చారు. ఈ విషయంలో రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల కమిషన్ ని కలుస్తానన్నారు. -
గవర్నర్ ను కలిసిన టీ బీజేపీ నేతలు
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం ఉదయం గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని వార్డుల విభజనపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇష్టా రాజ్యంగా వార్డులను విభజించారని బీజేపీ నేతలు నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ కలిసిన వారిలో శాసనసభాపక్ష నేత డాక్టర్ కె. లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పలువులు బీజేపీ నేతలు ఉన్నారు.