
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళసైను తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం కలిశారు. రాచకొండ పరిధిలో లాకప్‌డెత్‌పై గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణలో రాజ్యాంగపరమైన స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. మరియమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, దళితులపై జరుగుతున్న దాడులపై గవర్నర్‌కు వివరించామని తెలిపారు. తెలంగాణలో పోలీసులకు, టీఆర్ఎస్ నేతలకు తేడా లేదని వ్యాఖ్యానించారు. పోలీసులు.. టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆచరణలో లేదని శ్రీధర్‌బాబు ధ్వజమెత్తారు.