ఫేస్బుక్లో మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు | Canada's Sikh defence minister faces racial abuse | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు

Published Fri, Nov 13 2015 2:37 PM | Last Updated on Sun, Sep 3 2017 12:26 PM

ఫేస్బుక్లో మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు

ఫేస్బుక్లో మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు

టొరంటో: కెనడా రక్షణ మంత్రికీ జాతి వివక్ష తప్పలేదు. కెనడా కొత్త రక్షణ మంత్రి హర్జీత్ సజ్జన్ను ఉద్దేశిస్తూ ఓ సైనికుడు సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కెనడా సైనిక దళాలు విచారణ ప్రారంభించాయి.
 
హర్జీత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సైనికుడి పేరు, ఏ వ్యాఖ్యలు చేశారన్న వివరాలను వెల్లడించేందుకు సైన్యం నిరాకరించింది. అయితే మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలను ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్టు విచారణ కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ఫేస్బుక్లో ఫ్రెంచి భాషలో రాసిన ఈ కామెంట్స్ను వెంటనే తొలగించారు. కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికి చెందిన హర్జీత్ సజ్జన్ నియమితులైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement