racial abuse
-
Tokyo Olympics: జాతి వివక్ష కామెంట్లు.. గ్రౌండ్ వీడిన ప్లేయర్స్
టోక్యో ఒలింపిక్స్ ముగింట ‘జాతి’ వివక్ష వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జర్మనీ ఫుట్‌బాల్ జట్టు ఆటగాడు జోర్డాన్ టోరునారిను ఉద్దేశించి ప్రత్యర్థి ఆటగాళ్లు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. సెంట్రల్ అమెరికా జట్టు హోండురస్‌తో శనివారం జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. జపాన్ వాకయామా స్టేడియంలో ఇరు జట్లు తలపడగా.. ఆట మధ్యలో జోర్డాన్‌ను ఉద్దేశించి హోండురస్ ఆటగాళ్లు వివక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని జర్మన్ ఫుట్‌బాల్ అసోషియేషన్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఆటగాళ్లను విమర్శించినప్పుడు ఆటను కొనసాగించడం కరెక్ట్ కాదని, అందుకే మైదానం వీడినట్లు హెడ్‌కోచ్ స్టెఫాన్ కుంట్జ్ ఒక ప్రకటనలో చేసిన పనిని సమర్థించుకున్నారు. ℹ️ The game has ended 5 minutes early with the score at 1-1. The Germany players left the pitch after Jordan Torunarigha was racially abused.#WirfuerD #Tokyo2020 pic.twitter.com/D85Q63Ynr9 — Germany (@DFB_Team_EN) July 17, 2021 ఆట ముగియడానికి ఐదు నిమిషాల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. అప్పటికే స్కోర్ 1-1తో సమంగా ఉంది. అయితే గ్రౌండ్లో ఆటగాళ్ల మధ్య చిన్నగొడవ వల్లే అలా జరిగిందని హోండరస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ తెలిపింది. ఈ ఘటనను పలు దేశాల ఫుట్‌బాల్ ఫెడరేషన్లు ఖండిస్తున్నాయి. టోక్యో ఒలింపిక్స్ కమిటీ ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే నైజీరియా సంతతికి చెందిన టోరునారిగా ఇలాంటి వివక్షకు గురికావడం ఇదే తొలిసారి కాదు. కిందటి ఏడాది ఓ మ్యాచ్ సందర్భంగా చాకె ఫ్యాన్స్ ‘మంకీ’ నినాదాలతో గ్రౌండ్‌ను హోరెత్తించారు. -
వర్ణ వివక్ష: మీలాంటి అభిమానులు మాకొద్దు
లండన్: ఈ మధ్యన క్రీడల్లో వర్ణ వివక్ష వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానుల్లో కొంతమంది తమ ఫేవరెట్ జట్టు ఓడిపోతే జట్టులోని కొందరు ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా యూరోకప్ 2020లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆదివారం జరిగిన యూరోకప్ ఫైనల్లో ఇటలీ ఇంగ్లండ్‌ను ఫెనాల్టీ షూటౌట్లో ఓడించి 53 ఏళ్ల తర్వాత యూరోకప్ను గెలుచుకుంది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా ఉండడంతో ఫెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. అయితే ఫెనాల్టీ షూటౌట్లో ఇంగ్లండ్ తమ స్వయంకృత తప్పిదాలతో ఓడిపోవాల్సి వచ్చింది. అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన సౌత్‌గేట్ ప్రణాళిక పెనాల్టీల విషయంలో తప్పుగా తేలింది. ఫామ్‌లో ఉన్న స్టెర్లింగ్‌కు అవకాశం ఇవ్వకపోవడం, ఇద్దరు సీనియర్లు హ్యారీ కేన్, హ్యారీ మాగ్వైర్ తొలి రెండు పెనాల్టీలు తీసుకొని కీలకమైన, తీవ్ర ఒత్తిడి ఉండే మిగతా పెనాల్టీలను యువ ఆటగాళ్లకు వదిలేయడం కూడా పెద్ద తప్పే. ఇంగ్లండ్ తరఫున బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్‌ఫోర్డ్ మూడు పెనాల్టీలు వృథా చేశారు. అయితే మ్యాచ్ ఫలితం తర్వాత నల్ల జాతీయులైన ఈ ముగ్గురు యువ ఆటగాళ్లపై దురదృష్టవశాత్తూ ఇంగ్లండ్ అభిమానులు వర్ణ వివక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో వారిని దూషిస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడంపై ఫుట్‌బాల్ సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ హ్యరీ కేన్ ఆటగాళ్లపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలను తప్పుబడుతూ ఘాటుగా స్పందించాడు. '' మ్యాచ్ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఈరోజు ఫైనల్లో మేం ఓడిపోయినందుకు మాకు బాధగానే ఉంది. కానీ బుకాయో సాకా, జేడన్ సాంచో, మార్కస్ రాష్ఫోర్డ్లను టార్గెట్ చేస్తూ మీరు చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. నిజానికి ఆ ముగ్గురికి అనుభవం లేకపోవచ్చు.. కానీ ఒక చారిత్రక ఫైనల్ మ్యాచ్‌ను వారు ఆడారంటే.. వారిలో ఎంతో ప్రతిభ ఉంటే తప్ప ఇక్కడి వరకు రారు. ఫెనాల్టీ షూటౌట్లో వారిపై నమ్మకముంచి అవకాశమిచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ మేము ఫలితాన్ని అందుకోలేకపోయాం. అంత మాత్రానికే మీలో కొందరు ఇలాంటి వర్ణ వివక్ష వ్యాఖ్యలకు దిగుతారా.. జట్టుకు అవసరం లేదని వారిపై కామెంట్లు చేశారు. ఇప్పుడు నేను చెబుతున్నా.. వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసిన మీలాంటి అభిమానులు మాకొద్దు'' అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డాడు. మరోవైపు ఓటమి అనంతరం ఇంగ్లండ్ వీధుల్లో కూడా అభిమానులు వీరంగం సృష్టించారు. లీసెస్టర్ స్క్వేర్ వద్ద చెత్త పోసి బాటిల్స్ తగలబెట్టి రచ్చ రచ్చ చేశారు. మ్యాచ్ ముగియగానే పలువురు ఇటలీ అభిమానులపై దాడులు కూడా చేయడం బాధాకరం. ఇక మేజర్ టోర్నీలలో గతంలో ఆరు సార్లు పెనాల్టీ షూటౌట్లోనే ఓటమి పాలైన ఇంగ్లండ్‌కు ఈ ఫలితం కూడా అదే వేదనను మిగిల్చింది. ఇటలీ ఖాతాలో నాలుగు ప్రపంచకప్ టైటిల్స్ (1934, 1938, 1982, 2006) కూడా ఉన్నాయి. చాంపియన్ ఇటలీ జట్టుకు కోటి యూరోలు (రూ. 88 కోట్ల 46 లక్షలు), రన్నరప్ ఇంగ్లండ్ జట్టుకు 70 లక్షల యూరోలు (రూ. 61 కోట్ల 91 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఆటగాళ్లపై జాత్యాహంకార వ్యాఖ్యలు నిజమే
సాక్షి. న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇటీవల ముగిసిన సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లు జాతి వివక్షను ఎదుర్కొన్న మాట వాస్తవమేనని క్రికెట్ ఆస్ట్రేలియా అంగీకరించింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించింది. భారత ఆటగాళ్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు మైదానంలో ఫీల్డింగ్ చేస్తుండగా ఆసీస్ అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని టీమిండియా మేనేజ్మెంట్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా విచారణ చేపట్టింది. చదవండి: చెన్నై వేదికగా ఐపీఎల్ 2021 మినీ వేలం సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని గుర్తించామని.. నిబంధనల ప్రకారం నిందితులను మైదానంలోకి అడుగుపెట్టకుండా దీర్ఘకాల నిషేధం విధిస్తామని సీఏ అధికారులు వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు పుజారా, విహారి, అశ్విన్, పంత్‌లు గాయాల బారిన పడినప్పటికీ సమయోచితంగా పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో సఫలమయ్యారు. ఇక ఆఖరిదైన నాలుగో టెస్టులో భారత ఆటగాళ్లు మరోసారి చెలరేగి ఆసీస్ గడ్డపై చారిత్రక సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. -
'వీధి రౌడీలకంటే దారుణంగా ప్రవర్తించారు'
సిడ్నీ: టీమిండియా క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాపై ఆసీస్ అభిమానులు జాతి వివక్ష వ్యాఖ్యలపై పలువురు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్లో ఇలాంటి వాటికి తావులేదని.. ఎవరైనా అలా చేస్తే మరే మ్యాచ్‌కు అనుమతి లేకుండా వారిపై జీవితకాల నిషేధం విధించాలని పేర్కొన్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి బుమ్రా, సిరాజ్‌ల విషయంపై ట్విటర్లో సీరియస్ అయ్యాడు.(చదవండి: బ్రౌన్ డాగ్.. బిగ్ మంకీ అంటూ సిరాజ్‌పై మరోసారి) 'ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో కొందరు అభిమానులు వీధి రౌడీలకంటే దారుణంగా ప్రవర్తించారు. జెంటిల్మెన్ గేమ్‌కు పెట్టింది పేరైన క్రికెట్లో జాత్యహంకార వ్యాఖ్యలు సహించరానివి. గ్రౌండ్లో ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు చూశాం.. కానీ ఇవాళ చేసిన పని అసలు సిసలు రౌడీ ప్రవర్తనకు నిదర్శనంగా కనిపిస్తోంది. వెంటనే ఈ ఘటనపై విచారణ జరపాలి. మళ్లీ ఇలాంటివి జరగకుండా బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ' విరాట్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. Racial abuse is absolutely unacceptable. Having gone through many incidents of really pathetic things said on the boundary Iines, this is the absolute peak of rowdy behaviour. It's sad to see this happen on the field. — Virat Kohli (@imVkohli) January 10, 2021 కాగా సిడ్నీ టెస్టులో మూడో రోజు ఆటలో సిరాజ్, బుమ్రాను లక్ష్యంగా చేసుకొని జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కొంతమంది.. నాలుగోరోజు మరోసారి సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేశారు. నాలుగో రోజు రెండో సెషన్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బ్రౌన్ డాగ్, బిగ్ మంకీ అంటూ సిరాజ్‌నుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సిరాజ్ ఫిర్యాదుతో ఆ వ్యాఖ్యలు చేసిన వారిని పోలీసులు బయటకు పంపించేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఐసీసీ కూడ సీరియస్ అయింది. టీమిండియా ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఐసీసీ విచారణను కూడా చేపట్టింది.(చదవండి: కెప్టెన్‌తో గొడవ.. టీమ్ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్) -
టాక్సీ డబ్బులు అడిగిన భారతీయుడిపై దారుణం
లండన్: టాక్సీ డబ్బులు అడిగినందుకు భారత సంతతికి చెందిన ఓ టాక్సీ డ్రైవర్ ను ఇస్లామిక్ స్టేట్ సభ్యుడంటూ ఆరోపిస్తూ నలుగురు ప్రయాణికులు అతడిపై దాడికి దిగారు. గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక న్యూస్ పేపర్ కథనం ప్రకారం... భారత్‌కు చెందిన కనక్ హిరానీ బ్రిటన్‌లో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 4న కొందరు ప్రయాణికులు హిరానీ టాక్సీ ఎక్కారు. వేల్స్ లోని కార్డిఫ్ సిటీ నుంచి సమీపంలోని ఓ రెస్టారెంట్‌కు తీసుకెళ్లాలని సూచించారు. రెస్టారెంట్ వద్ద టాక్సీ ఆపమని ఇద్దరు వారికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కోసం లోనికి వెళ్లారు. టాక్సీలో ఉన్న మరో ఇద్దరితో ఆలస్యం అవుతుందని, ఇప్పటికే మీటరుపై 20 పౌండ్లు ఎక్కువ అయిందని హిరానీ చెప్పాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. టాక్సీ డ్రైవర్‌కు మనీ ఇవ్వడం ఇష్టంలేని కారణంగా వారు అనవసర రాద్దాంతం చేశారు. మొదట తమ వద్ద డబ్బులున్నాయి ఏం పర్లేదు అన్నారనీ.. ఆ తర్వాత టాక్సీలో కూర్చున్న ఇద్దరు తనను తిట్టడం మొదలెట్టారన్నాడు. ఆ తర్వాత టాక్సీకి అడ్డంగా రోడ్డుపై ఉండి హిరానీని ఇబ్బంది పెట్టారు. ఏకంగా డ్రైవర్ నుంచి టాక్సీ లాక్కుని అతడ్ని గెంటేయాలని చూడటం గమనార్హం. నువ్వు ఐఎస్ఐఎస్ కి చెందిన ఉగ్రవాదివి కాదని నమ్మడం ఎలా.. రుజువు చేస్తావా అని టాక్సీ డబ్బులు ఎగ్గొట్టడానికి డ్రైవర్‌ను దబాయించారు. దాడి చేయాలని వారు ప్రయత్నించగా ఏం చేయాలో పాలుపోని డ్రైవర్ అలారమ్ ఆన్ చేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారని సౌత్ వేల్స్ పోలీసు అధికారి తెలిపారు. టాక్సీ మనీ పేమెంట్ నుంచి బయటపడటానికి జాతి అహంకార దాడులకు పాల్పడ్డ ఈ ఘటనలో నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
ఫేస్బుక్లో మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు
టొరంటో: కెనడా రక్షణ మంత్రికీ జాతి వివక్ష తప్పలేదు. కెనడా కొత్త రక్షణ మంత్రి హర్జీత్ సజ్జన్‌ను ఉద్దేశిస్తూ ఓ సైనికుడు సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు పోస్ట్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కెనడా సైనిక దళాలు విచారణ ప్రారంభించాయి. హర్జీత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సైనికుడి పేరు, ఏ వ్యాఖ్యలు చేశారన్న వివరాలను వెల్లడించేందుకు సైన్యం నిరాకరించింది. అయితే మంత్రిపై తీవ్ర వ్యాఖ్యలను ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్టు విచారణ కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ఫేస్బుక్లో ఫ్రెంచి భాషలో రాసిన ఈ కామెంట్స్‌ను వెంటనే తొలగించారు. కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతికి చెందిన హర్జీత్ సజ్జన్ నియమితులైన సంగతి తెలిసిందే.