రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం రక్షణ మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టారు. నిరాబండరంగా జరిగిన కార్యక్రమంలో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
మనోహర్ పరీకర్ రాజీనామా చేయడంతో రక్షణ మంత్రి పదవి ఖాళీ అయింది. గోవా ముఖ్యమంత్రిని చేపట్టేందుకు ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. పరీకర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఆమోదించారు.
ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. ఇంతకుముందు కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2014, మే 26 నుంచి అదే ఏడాది నవంబర్ 9 వరకు రక్షణ మంత్రి బాధ్యతలు చేపట్టారు.