
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయుగు భేటీ అయ్యారు. ప్రాంతీయ భద్రత, సైనిక అంశాలపై ఆయనతో చర్చించినట్లు ఉ. కొరియా అధికారిక మీడియా తర్వాత వెల్లడించింది.
1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 వసంతాలు పూర్తిచేసుకుంటున్న వేళ కిమ్‌తో రష్యా రక్షణ మంత్రి సమావేశంకావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పాంగ్‌యాంగ్‌లో సమావేశమైన సెర్గీ, కిమ్‌లు పలు అంశాలపై పరస్పర ఒప్పందానికి వచ్చారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీని కిమ్ ఆయుధాల ఎగ్జిబిషన్‌కు తీసుకువెళ్లారు. అందులో ఉ.కొరియా ఇటీవల ప్రయోగించిన క్షిపణి వేరియంట్లను దగ్గరుండి చూపించారు.
Comments
Please login to add a commentAdd a comment