శ్రీనగర్ : కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ బేస్ క్యాంప్‌ను పర్యటించారు. జమ్మూకశ్మీర్‌లో రెండోరోజు పర్యటనలో భాగంగా ఆమె దేశ రక్షణపరంగా కీలక వ్యూహాత్మక ప్రాంతాలు అయిన లేహ్, లడఖ్, సియాచిన్ ప్రాంతాలను సందర్శించారు. అలాగే సియాచిన్ బేస్ క్యాంప్‌లో అమరవీరులకు నిర్మలా సీతారామన్ నివాళులు అర్పించారు. అనంతరం లేహ్‌లో బ్రిడ్జిను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా నిర్మలా సీతారామన్...సైనికులకు దసరా శుభాకాంక్షలు తెలిపినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్మలా సీతారామన్ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. రక్షణమంత్రితో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నారు.