బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం మెరుపు దాడుల నేపథ్యంలో ప్రస్తుతం భారత్- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం అలుముకుంది. మంగళవారం భారత్ జరిపిన దాడులను ఎదుర్కోలేక పాక్ యుద్ధ విమానాలు తోక ముడిచిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు 12 మిరాజ్- 2000 విమానాలు రంగంలోకి దిగి.. దాయాది దేశానికి హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ఈ మెరుపు దాడుల అనంతరం విదేశాంగ మంత్రి ఖురేషీతో కలిసి.. పాక్ రక్షణ శాఖ మంత్రి పర్వేజ్ ఖటక్ పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో పాక్ వాయుదళాన్ని వెనకేసుకొచ్చిన ఆయనను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటువంటి రక్షణ మంత్రిని పెట్టుకుని పాక్ భారత్‌పై యుద్ధానికి సిద్ధమవుతోందా అంటూ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు.
చీకటిగా ఉంది అందుకే!
‘పాక్ వాయుదళం ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటుంది. అయితే మెరుపు దాడులు జరిగిన సమయంలో చీకటిగా ఉంది. అందుకే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారు. కేవలం ఈ కారణంగానే వాళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ ప్రస్తుతం వారికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం’ అని సర్జికల్ స్ట్రైక్స్ గురించి పర్వేజ్ మాట్లాడినట్లుగా ఉన్న వీడియోను... ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు... ‘ మెరుపు దాడులపై పాక్ రక్షణ మంత్రి స్పందన చూడండి. పాక్ వైమానిక దళం సిద్ధంగానే ఉందట. కానీ చీకటి ఉన్నందువల్లే ఇలా జరిగిందట. ఇలాంటి మంత్రిని పెట్టుకుని వాళ్లు భారత్‌పై యుద్ధానికి సిద్ధమవుతున్నారు అని ఓ నెటిజన్ వ్యంగమాడగా... ‘ భారత వైమానిక దళం టామోటాలు జారవిడుస్తోందని పాపం పాక్ వైమానిక దళం భావించినట్లుంది. లేదంటేనా అమ్మతోడు...’ అంటూ మరో వ్యక్తి హాస్యోక్తులు విసిరాడు.
Pak Defence Min response : " Our Air Force were ready but it was DARK". Hahahahhahahahahhaha seriously ? This is defence minister ? And they want to attack India. #IndiaStrikesBack #PulwanaRevenge
— Abhijeet Srivastava (@Abhijeet_92) February 26, 2019
#JustForLaughs 😄
— Rajeev Chandrasekhar 🇮🇳 (@rajeev_mp) February 26, 2019
Tauba Tauba these tomatoes! pic.twitter.com/ukkN1ymlXh
@AniqaNisar According to Pak Defence Minister, Pak Air Force was ready to retaliate, but they failed to do so due to darkness! Appreciate the honesty & frankness of the minister which is essential for improving Indo Pak relation!
— NARENDRA NARAYAN (@NARENDRANARAYAN) February 26, 2019
Comments
Please login to add a commentAdd a comment