
పార్లమెంట్‌లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన వివరణను తప్పుబట్టిన పాక్. పైగ ఇది బాధ్యత రహితమైన వివరణ అంటూ విమర్శలు గుప్పించింది.
It is not enough to satisfy Pakistan: క్షిపణి ఘటనపై భారత రణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన ప్రకటనను పాకిస్తాన్ తిరస్కరించింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ మార్చి 9 నాటి సంఘటనలా 'బాధ్యతా రహితమైన వివరణగా పేర్కొన్నాడు. పైగా ఇది 'అత్యంత బాధ్యతారహితమైన చర్య' అని అన్నారు. భారత్ ఆదేశించిన దర్యాప్తును కూడా ఏకపక్షమైన విచారణగా ఆరోపించింది. పాకిస్తాన్‌ని సంతృప్తి పరచడానికి రాజ్‌నాథ్ సింగ్ వివరణ సరిపోదని, పైగా తిరస్కరిస్తున్నాం అని చెప్పారు. తాము ఉమ్మడి దర్యాప్తును కోరుతున్నాం అని పునరుద్ఘాటించారు.
అంతేకాదు ఈ ఆయుధం వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నందున ఈ సంఘటన ప్రభావం ఒక ప్రాంతానికి పరిమితం కాదన్నారు. ఇది కేవలం ప్రమాదం అని చెబితే సరిపోదు అని తేల్చి చెప్పారు. అయితే భారత్ తన తప్పును అంగీకరించడమే కాక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తానని కూడా తెలిపింది. పైగా తప్పులుంటే చర్యలు తీసుకుంటానని హామీ కూడా ఇచ్చింది. మరోవైపు అమెరికా కూడా ఈ విషయమై స్పందించింది. పైగా ఈ ఘటన అనుకోని ప్రమాదమని మరేం ఉద్దేశాలు లేవని భావిస్తున్నాం అని చెప్పింది కూడా. కానీ పాక్ మాత్రం ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూడటమే కాక తన అక్కసును వెళ్లగక్కుతోంది.
(చదవండి: పాక్‌లో భారత మిస్సైల్ ప్రమాదం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన)