Missile weapon
-
Israeli-Hezbollah War: కాల్చేసే కాంతిపుంజం!
లెబనాన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా? పక్కలో బల్లెంలా మారిన హెజ్బొల్లాను సమూలంగా తుడిచిపెట్టాలని నిర్ణయించుకుందా? హెజ్బొల్లా ఉగ్రవాదుల డ్రోన్లు, రాకెట్లను కూల్చడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ‘ఐరన్ బీమ్’ తొలిసారిగా రంగప్రవేశం చేయనుందా? ఇజ్రాయెలీలకు ప్రభుత్వం జారీ చేస్తున్న హెచ్చరికలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. హెజ్బొల్లాతో యుద్ధం మొదలైతే ఇజ్రాయెల్ ప్రజలకు కొన్ని రోజులపాటు విద్యుత్ సంక్షోభం తప్పదన్న హెచ్చరికల పత్రం దేశ న్యాయ శాఖలో రౌండ్లు కొడుతున్నట్టు ‘ద జెరూసలెం పోస్ట్’ ఓ కథనం ప్రచురించింది. చాలా ప్రాంతాల్లో ఒకటి నుంచి మూడు రోజుల దాకా కరెంటు సరఫరా ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ నేషనల్ ఎమర్జెన్సీ అథారిటీ కూడా పేర్కొంది. ప్రజలు ఆహారం, నీరు, బ్యాటరీ వంటివి దగ్గరుంచుకోవాలని సూచించింది...! ప్రపంచంలోనే తొలిసారి! ఐరన్ బీమ్. ఉగ్రవాదుల రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేసి క్షణాల్లో కాల్చి బూడిదగా మార్చే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ. తీవ్రమైన కాంతిపుంజపు ఉష్ణశక్తితో కూడిన ఈ వినూత్న సాంకేతిక ఆయుధాల గురించి వినడమే తప్ప ఇప్పటిదాకా ఏ దేశమూ ప్రయోగించలేదు. చెప్పాలంటే ప్రయోగాత్మక దశలో ఉన్న టెక్నాలజీ ఇది. ఇజ్రాయెల్ రఫేల్ అడ్వాన్సుడ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. ఇది స్టార్ ట్రెక్, స్టార్ వార్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని ఆయుధాల్లా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ‘డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్’గా వ్యవహరించే ఈ కొంగొత్త వ్యవస్థను 2014 ఫిబ్రవరి 11న సింగపూర్ ఎయిర్ షోలో ప్రదర్శించారు. పాలస్తీనీ హమాస్, లెబనీస్ హెజ్బొల్లా ఉగ్ర సంస్థలతో తాజా ఘర్షణలు, యుద్ధం నేపథ్యంలో దీన్ని ఇజ్రాయెల్ రంగంలోకి దించనుందని తెలుస్తోంది. ఇలా పని చేస్తుంది... యారో–2, యారో–3, డేవిడ్స్ స్లింగ్, ఐరన్ డోమ్ తర్వాత ఇజ్రాయెల్ అమ్ములపొదిలో సరికొత్త ఆగ్నేయాస్త్రం ఐరన్ బీమ్. ఇది ఫైబర్ లేజర్ ఆధారంగా పనిచేస్తుంది. ఐరన్ డోమ్‌తో పోలిస్తే ఐరన్ బీమ్ చిన్నది, తేలికైనది. రహస్యంగా ప్రయోగించడానికి, ఒక చోట నుంచి మరో చోటికి తరలించడానికి మరింత అనువైనది. ఐరన్ డోమ్ కూడా ఇజ్రాయెల్ స్వల్పశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థే. కానీ ఇటీవలి హమాస్ రాకెట్ దాడులను నిలువరించడంలో విఫలమైంది. ఇప్పుడు డోమ్‌కు బీమ్‌ను జతచేసి సత్ఫలితాలు రాబట్టాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఐరన్ బీమ్కూ పరిమితులు లేకపోలేదు. తడి వాతావరణ పరిస్థితుల్లో ఈ లేజర్ వ్యవస్థ పనిచేయదు. ఎంతటి సానుకూల పరిస్థితులున్నా వాతావరణంలోని తేమ వల్ల 30% నుంచి 40% వరకు శక్తిని లేజర్ కోల్పోతుంది. అలాగే ధ్వంసం చేయాల్సిన లక్ష్యం ఐరన్ బీమ్ దృష్టి రేఖకు సూటిగా ఉండాలి. నేరుగా కంటికి కనిపించకుండా, బీమ్‌కు సూటిగా కాకుండా లక్ష్యం ఎక్కడో నక్కి ఉంటే లేజర్ కిరణాలతో నాశనం చేయడం అసాధ్యం. పైగా ఐరన్ బీమ్ ఫైరింగ్ రేటు కూడా తక్కువ. లక్ష్యాన్ని ధ్వంసం చేయడానికి సరిపోయేంత లేజర్ శక్తిని ప్రయోగించాలంటే కనీసం 5 సెకన్లు, అంతకు మించి సమయం కావాలి. అయినప్పటికీ శత్రు క్షిపణులను గగనతలంలోనే అడ్డుకుని కూల్చేసే సంప్రదాయ ఇంటెర్సెప్టర్ క్షిపణులతో పోలి్చతే ఐరన్ బీమ్ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైనది. ‘ఖర్చు తక్కువ, పనితీరు ఎక్కువ’ అన్నది దీని సూత్రం. పైగా దీన్ని ఎన్నిసార్లైనా పేల్చవచ్చు. ఒక్కో షాట్‌కు అయ్యే వ్యయమూ తక్కువ. ఐరన్ డోమ్‌లో ఒక్కో ఇంటెర్సెప్టర్ రాకెట్‌కు 60 వేల డాలర్ల దాకా అవుతుండగా ఐరన్ బీమ్‌లో మాత్రం ఆ ఖర్చు కేవలం కొన్ని డాలర్లే. అంతేకాదు, ఈ వ్యవస్థలో శత్రు క్షిపణిని ఢీకొట్టాక ఇంటెర్సెప్టర్ శకలాలు పడే ముప్పు కూడా ఉండదు. 7 కిలోమీటర్ల పరిధిలోని క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాలు, మోటార్ షెల్స్ వంటివాటిని ఐరన్ బీమ్ క్షణాల్లో నిరీ్వర్యం చేయగలదు. దీన్ని 2025 నాటికి మోహరించాలని ఇజ్రాయెల్ భావించినా యుద్ధం అవసరాలతో ఇప్పుడే రంగంలో దించేలా ఉంది. ఐరన్ బీమ్ X లైట్ బీమ్! ఈ రెండు హై ఎనర్జీ లేజర్ వ్యవస్థలనూ రఫేల్ సంస్థే అభివృద్ధి చేస్తోంది. లైట్ బీమ్ 7.5 కిలోవాట్ల ఇంటెర్సెప్టర్. రెండు కిలోమీటర్ల దూరంలోని చిన్నపాటి మానవరహిత వైమానిక వాహనాలు, నేలమీద అత్యాధునిక మందుపాతరలు, పేలని మందుగుండు తదితరాలను ఇది నిర్వీర్యం చేయగలదు. ఐరన్ బీమ్ 100 కిలోవాట్ల తరగతికి చెందిన హై ఎనర్జీ లేజర్ సిస్టమ్. ఇది రాకెట్లు, శతఘ్నులు, యూఎవీలను కూల్చగలదు. – జమ్ముల శ్రీకాంత్ -
ఆ వివరణ సరిపోదన్న పాక్! ఉమ్మడి విచారణకు డిమాండ్
It is not enough to satisfy Pakistan: క్షిపణి ఘటనపై భారత రణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇచ్చిన ప్రకటనను పాకిస్తాన్ తిరస్కరించింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ మార్చి 9 నాటి సంఘటనలా 'బాధ్యతా రహితమైన వివరణగా పేర్కొన్నాడు. పైగా ఇది 'అత్యంత బాధ్యతారహితమైన చర్య' అని అన్నారు. భారత్ ఆదేశించిన దర్యాప్తును కూడా ఏకపక్షమైన విచారణగా ఆరోపించింది. పాకిస్తాన్‌ని సంతృప్తి పరచడానికి రాజ్‌నాథ్ సింగ్ వివరణ సరిపోదని, పైగా తిరస్కరిస్తున్నాం అని చెప్పారు. తాము ఉమ్మడి దర్యాప్తును కోరుతున్నాం అని పునరుద్ఘాటించారు. అంతేకాదు ఈ ఆయుధం వార్‌హెడ్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉన్నందున ఈ సంఘటన ప్రభావం ఒక ప్రాంతానికి పరిమితం కాదన్నారు. ఇది కేవలం ప్రమాదం అని చెబితే సరిపోదు అని తేల్చి చెప్పారు. అయితే భారత్ తన తప్పును అంగీకరించడమే కాక ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తానని కూడా తెలిపింది. పైగా తప్పులుంటే చర్యలు తీసుకుంటానని హామీ కూడా ఇచ్చింది. మరోవైపు అమెరికా కూడా ఈ విషయమై స్పందించింది. పైగా ఈ ఘటన అనుకోని ప్రమాదమని మరేం ఉద్దేశాలు లేవని భావిస్తున్నాం అని చెప్పింది కూడా. కానీ పాక్ మాత్రం ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూడటమే కాక తన అక్కసును వెళ్లగక్కుతోంది. (చదవండి: పాక్‌లో భారత మిస్సైల్ ప్రమాదం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన) -
మిస్సైల్ రచ్చ! భారత్‌పై పాక్ సంచలన ఆరోపణలు
భారత్‌పై దాయాది పాకిస్థాన్ సంచలన ఆరోపణలకు దిగింది. భారత్‌కు చెందిన సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి తమ సరిహద్దులో కుప్పకూలిందంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేసి కలకలం రేపింది. ఇది ఉల్లంఘనే అవుతుందని, దీనిపై భారత్ వివరణ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్సోనిక్ మిస్సైల్ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్ సరిహద్దులో కూలిందని పాక్ ఆరోపించింది. ప్యాసింజర్ ఫ్లయిట్లు తిరిగే ఎత్తులోనే ఈ దూసుకొచ్చిందని, పైగా అది పడిన ప్రాంతం జనావాసమని ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు పాక్ మేజర్ జనరల్, ISPR డీజీ అయిన బాబర్ ఇఫ్తికర్ ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలు తెలిపాడు. పాకిస్థానీ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్.. భారత సరిహద్దు నుంచి వచ్చిన మిస్సైల్ అనుమానిత వస్తువును స్వాధీనం చేసుకుంది. మియా చన్ను సమీపంలో అది పడిపోయింది. ఇది పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే. ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ, అక్కడే ఉన్న గోడ మాత్రం నాశనం అయ్యింది అని ఇఫ్తికర్ వెల్లడించాడు. శిథిలాను బట్టి.. అదొక సూపర్ సోనిక్ మిస్సైల్ అయి ఉంటుందని భావిస్తున్నాం (BrahMos supersonic cruise missile గా అనుమానిస్తోంది పాక్). కానీ, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. భారత్ ఈ ఘటనపై వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ ఘోరమైన ఉల్లంఘనను తీవ్రంగా నిరసిస్తూ.. భవిష్యత్తులో అలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని భారత్‌ను హెచ్చరిస్తున్నాం అంటూ ప్రసంగించాడు ఇఫ్తికర్. ఇదిలా ఉంటే పాక్ ఆరోపణలపై అటు రక్షణ శాఖ, ఇటు భారత వాయు సేన గానీ స్పందించాల్సి ఉంది. 2005 ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల క్షిపణి పరీక్షలు గనుక నిర్వహిస్తే.. మూడు రోజుల ముందు తెలియజేయడంతో పాటు, ఇరు దేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం జరగకుండా నిర్ణీత వ్యవధిలోనే ఆ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. -
అలర్ట్.. క్షిపణులను తరలిస్తున్న కిమ్
సాక్షి, ప్యాంగ్యాంగ్ : తమను బాగా రెచ్చగొడుతున్న అమెరికాకు ఊహించని షాక్ ఇస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే మరో పరిణామం చోటు చేసుకుంది. రాజధాని ప్యాంగ్ యాంగ్‌కు క్షిపణులను తరలించటం ఆందోళన కలిగిస్తోంది. శాటిలైట్ వీక్షణలో ఈ విషయం వెలుగు చూడటం విశేషం. ఈ నేపథ్యంలో అదను చూసుకుని కిమ్ సైన్యాలు అమెరికాపై విరుచుకుపడే అవకాశం ఉందన్న హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే అమెరికా ఎంత మాత్రం ఆవేశపడటం లేదు. ‘మొదటి బాంబు పడేవరకు’ దౌత్యపరమైనే చర్చల ద్వారానే ప్రయత్నిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా.. కొరియా ద్వీపకల్పంలో దక్షిణ కొరియాతో కలిసి అమెరికా భారీ ఎత్తున డ్రిల్స్ చేస్తుంది. నేవీ డ్రిల్స్ నిర్వహించడం తమను రెచ్చగొట్టేందుకు అమెరికా పన్నిన కుట్ర అని కిమ్ ఆరోపిస్తున్నాడు. అంతేకాదు నేవీ డ్రిల్స్ ముగిసిన వెంటనే దక్షిణకొరియాతో మరో డ్రిల్ ను అమెరికా నిర్వహించనుందన్న వార్తల నేపథ్యంలో. అమెరికా ఇలాంటి చర్యలను కొనసాగిస్తే...ఆదేశం ఊహించని సమయంలో ఊహకందని విధంగా దాడులు చేస్తామని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ప్రతి రెండేళ్లకోసారి దక్షిణకొరియా, అమెరికాలు సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న విన్యాసాలు మాత్రం అనుమానాస్పదంగా ఉన్నాయని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నడుమ ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కుళ్లుతోనే అమెరికా ఆరోపణలు... తమ దేశం అభివృద్ధిని చూసి ఓర్వలేక అమెరికా ఆరోపణలు చేస్తోందని ఉత్తర కొరియా అంటోంది. ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియా రాయబారి కిమ్ రోయాంగ్ మాట్లాడుతూ.. రానున్న ఐదేళ్లలో తమ దేశం ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రణాళికలు రచించిందని... కానీ, అమెరికా మాత్రం వాటిని వేరేలా అభివర్ణిస్తోందని అన్నారు. ఆర్థికంగా బలపడేందుకు తమ అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ వినూత్న కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్తుంటే.. అమెరికా కుళ్లుకుంటుందని రోయాంగ్ విమర్శించారు. అమెరికా ఆరోపణల ఆధారంగానే ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు కూడా తమ దేశాన్ని అనుమానిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆ ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని రోయాంగ్ స్పష్టం చేశారు. -
‘అస్త్ర’ పరీక్ష విజయవంతం
బాలాసోర్: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర (గగనతలంలో సుదూర లక్ష్యాలను సైతం ఛేదించే–బీవీఆర్‌ఏఏఎమ్) క్షిపణిపై వివిధ దశల్లో నిర్వహించిన పరీక్ష విజయవంతంగా పూర్తయింది. నాలుగురోజులుగా జరుగుతున్న ఈ క్షిపణి ట్రయల్స్ సఫలీకృతమయ్యాయని రక్షణ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘బంగాళాఖాతంలో అస్త్ర క్షిపణి (బీవీఆర్‌ఏఏఎమ్) చివరి దశ పరీక్ష విజయవంతమైంది. సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు ఒడిశాలోని చాందీపూర్ తీరం నుంచి ఈ పరీక్షలు జరిగాయి’ అని ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రయోగం సఫలీకృతం కావటంతో త్వరలోనే భారత వైమానిక దళంలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగంలో పాలుపంచుకున్న డీఆర్డీవో, ఏఐఎఫ్‌లతో పాటుగా పలు డీపీఎస్‌యూలను రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థ డైరెక్టర్ జనరల్ జి. సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసిన సాంకేతికత ద్వారా గగనతలం నుంచి గగనతల లక్ష్యాలను, భూమిపైనుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మరిన్ని విభిన్నమైన క్షిపణులను రూపొందించవచ్చని తెలిపారు.