సియోల్: దక్షిణ కొరియా రాజకీయంలో కొత్త ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్న ప్రకటించి.. అనంతరం విరమించుకోవడంతో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇక, దక్షిణ కొరియా రక్షణ మంత్రి కిమ్ యోంగ్-హ్యూన్ తాజాగా రాజీనామా చేశారు. అనంతరం, అధ్యక్షుడు.. కిమ్ రాజీనామాను ఆమోదించారు. వెంటనే.. సౌదీ అరేబియాలోని రాయబారి చోయ్ బ్యూంగ్-హ్యూక్‌ను కొత్త మంత్రి అభ్యర్థిగా నామినేట్ చేశారు. ఈ మేరకు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగానే ఆయన రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. దక్షిణ కొరియాలో ఎమర్జెన్సీ ప్రకటించిన వెంటనే అక్కడ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. ఇది గట్టెక్కాలంటే పార్లమెంటులో మూడింట రెండు వంతుల సభ్యుల మద్దతు అవసరం. కనీసం ఆరుగురు రాజ్యాంగ న్యాయమూర్తులు దీనికి అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. దక్షిణకొరియా పార్లమెంట్‌లో 300 మంది సభ్యులు ఉన్నారు. ఒకవేళ అధ్యక్షుడు అభిశంసనను గట్టెక్కాలంటే 200 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ తీర్మానాన్ని శుక్రవారం లోపు ఓటింగ్‌కు తీసుకురావచ్చని డెమోక్రటిక్ పార్టీ శాసనసభ్యుడు కిమ్ యోంగ్-మిన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment