మాస్కో : అణ్వాయుధ దేశాల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. ఒక దేశానికి మించి మరొక దేశం అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తున్నాయి.అగ్రదేశాల మధ్య ఈ పోటీ మరింత తీవ్రంగా ఉంది. తాజాగా రష్యా సర్మట్ ఖండాంతర క్షిపణిని రెండోసారి పరీక్షించింది. ఈ ప్రయోగం ద్వారా తాము అనుకున్న లక్ష్యాన్ని క్షిపణి చేరుకున్నట్లు రష్యా రక్షణ శాఖ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.
ఒక్క సర్మట్ క్షిపణిని అడ్డుకోవడానికి 500 అమెరికా ఏబీఎస్ క్షిపణులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఏకకాలంలో 10 టన్నుల పేలోడ్(సాధరణ, అణు పదార్థాలు)ను సర్మట్ మోసుకెళ్లగలదని వివరించారు. ప్రయోగం అనంతరం దాదాపు 20 మాక్‌ల వేగాన్ని(ధ్వని వేగానికి 20 రెట్లు) ఒక సెకన్ కాలంలో అందుకుంటుందని చెప్పారు. దేశ రక్షణకు 2021 నుంచి సర్మట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment