
మేలో భారత్‌కు అమెరికా రక్షణ మంత్రి
వాషింగ్టన్: భారత్‌తో రక్షణ రంగంలో సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ మేలో భారత్‌కు రానున్నారు. గత జనవరిలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు విచ్చేసి ఇరుదేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉండాలని ఆకాంక్షించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరుదేశాలు రక్షణ రంగంలో సహకారం అందించుకునేందుకు, వాణిజ్య సంబంధాలు మెరుగుపడేందుకు కార్టర్ భారత్‌కు వస్తున్నట్లు శుక్రవారం పెంటగాన్ వెల్లడించింది. ఆసియా దేశాలతో మరింత మెరుగైన సంబంధాలను కొనసాగించేందుకు ఆయన వచ్చే రెండు నెలల్లో రెండుసార్లు ఆసియా పర్యటన చేయనున్నట్లు పేర్కొంది. భారత్‌తోపాటు జపాన్, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించనున్నట్లు తెలిపింది.