!['విభజన బిల్లులోని అన్ని అంశాలు నెరవేరుస్తాం' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/51405021041_625x300_3.jpg.webp?itok=LjaARXo7)
'విభజన బిల్లులోని అన్ని అంశాలు నెరవేరుస్తాం'
విశాఖపట్నం: పాకిస్థాన్ ఒప్పందాలను ఉల్లంఘించి కాల్పులు జరుపుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. పాక్ కవ్వింపు చర్యలను గమిస్తున్నామన్నారు. శనివారం విశాఖపట్నంలో జలాంతర్గామి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కమోర్తాను అరుణ్ జైట్లీ జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. చైనా ... భారత దేశ భూభాగాన్ని దాటి వస్తుందిని... అయితే దాన్ని చొరబాటుగా పరిగణించలేమన్నారు. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకలు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. ఏపీ విభజన బిల్లులో ఉన్న అన్ని అంశాలను కేంద్రం తప్పక నెరవేరుస్తుందని జైట్లీ స్పష్టం చేశారు.