![Manohar Parrikar to Begin Second Phase of Treatment - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/26/manohar.jpg.webp?itok=UL47Db72)
మనోహర్ పరికర్(ఫైల్ ఫొటో)
పనాజి : మాజీ రక్షణ శాఖ మంత్రి, గోవా సీఎం మనోహర్ పరీకర్ తన ఆరోగ్యం బాగానే ఉందని.. వదంతులను నమ్మవద్దని గోవా ప్రజలకు విఙ్ఞప్తి చేశారని స్పీకర్ ప్రమోద్ సావంత్ తెలిపారు. చికిత్స కోసం అమెరికా వెళ్లిన.. పరికర్ తనతో ఫోన్‌లో మాట్లాడారని, రెండవ దశ చికిత్స ప్రారంభమైందని చెప్పారని సావంత్ పేర్కొన్నారు. పాలనా అంశాల గురించి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. పరీకర్ ఆరోగ్యంపై ఆందోళన వద్దని కోరారు.
ప్రాంకియాటైటిస్‌తో బాధ పడుతున్న పరీకర్ మొదట ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. గత నెల 17న బడ్జెట్ సమావేశం ఉన్నందున గోవాకు వెళ్లిన పరీకర్ ఆరోగ్యం మళ్లీ దెబ్బతినడంతో ముంబైకి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో అధునాతన చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment