Tezpur University
-
రక్షణ రంగ స్వావలంబనే ఏకైక లక్ష్యం: రాజ్‌నాథ్
తేజ్‌పూర్(అస్సాం): రక్షణలో స్వావలంబన సాధన కోసమే స్వదేశీ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. అస్సాంలో తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘‘ భారత్‌ను వ్యూహాత్మక ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే రక్షణరంగంలో స్వావలంబన అవసరం. అందుకే దేశీయ రక్షణరంగాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇందులోభాగంగా రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించుకుంటున్నాం. ఎగుమతులను నెమ్మదిగా పెంచుతున్నాం. దశాబ్దాలుగా దిగుమతి చేసుకుంటున్న 509 రకాల రక్షణ రంగ ఉత్పత్తులను ఇకపై దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించి వాటి దిగుమతులను నిషేధించాం. త్వరలో మరో 4,666 రకాల రక్షణ విడిభాగాలనూ దేశీయంగానే తయారుచేయాలని ప్రతిపాదించాం. ఇది కూడా త్వరలోనే ఆచరణలోకి తెస్తాం. తొలిసారిగా స్వదేశీ రక్షణ తయారీ రంగ పరిశ్రమ రూ.1లక్ష కోట్ల మార్క్‌ను దాటింది. 2016–17 కాలంలో రూ.1,521 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు ఇప్పుడు 10 రెట్లు పెరిగి రూ.15,920 కోట్లు దాటాయి’’ అని రాజ్‌నాథ్ చెప్పారు. దేశీయ రక్షణ రంగంలో ప్రధాని మోదీ కొత్త ఒరవడి తెచ్చారు’’ అన్నారు. -
జేఎన్యూకు ప్రతిష్టాత్మక అవార్డు
న్యూఢిల్లీ: విద్యార్థులపై రాజద్రోహం కేసులతో అట్టుడుకుతున్న ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ( జేఎన్‌యూ) ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పురస్కారం దక్కించుకుంది. 'ఉత్తమ పరిశోధన, కొత్త ఆలోచన' విభాగంలో రాష్ట్రపతి అవార్డు సొంతం చేసుకుంది. సందర్శకుల అవార్డుల్లో ప్రొఫెసర్ భట్నాగర్‌కు ఉత్తమ పరిశోధన (ఆంత్రాక్స్ వ్యాక్సిన్‌పై పరిశోధనలో), మాలిక్యులార్ పారాసిటాలజీ విభాగానికి కొత్త ఆలోచనను ప్రోత్సహించినందుకు (యాంటీ మలేరియా, అమీబియాసిస్ పరిశోధనలో) ఈ అవార్డు దక్కింది. సందర్శకుల అవార్డుల్లో అస్సాంలోని తేజ్‌పూర్ వర్సిటీ ఉత్తమ వర్సిటీగా ఎంపికైంది. ఈ నెల 14న రాష్ట్రపతి భవన్ లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డులు ప్రదానం చేస్తారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో పాటు లక్ష రూపాయల నగదు అందజేస్తారు.