జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కిష్ట్వార్ పట్టణంలో చోటుచేసుకున్న మతఘర్షణల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహారించిందని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్ష్యుడు రాజనాథ్ సింగ్ ఆరోపించారు. గురువారం న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆయన జెండా ఆవిష్కరణ చేశారు.
అనంతరం ఆయన ప్రసంగిస్తూ... ముస్లిం, హిందు మతల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలతో దేశ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశాలున్నాయన్నారు. కొంత మంది వ్యక్తులు భారత గడ్డపై ఉంటూ, పాకిస్థాన్ జిందాబాద్ అంటున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారి వల్లే దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటే ఇలాంటివారి ఆటలు కట్టించవచ్చని రాజనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.