Kishtwar violence
-
'కిష్ట్వార్'పై కేంద్రం ఉదాసీనత: రాజనాథ్
జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కిష్ట్వార్ పట్టణంలో చోటుచేసుకున్న మతఘర్షణల పట్ల కేంద్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహారించిందని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్ష్యుడు రాజనాథ్ సింగ్ ఆరోపించారు. గురువారం న్యూఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... ముస్లిం, హిందు మతల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలతో దేశ భద్రతకు ముప్పువాటిల్లే అవకాశాలున్నాయన్నారు. కొంత మంది వ్యక్తులు భారత గడ్డపై ఉంటూ, పాకిస్థాన్ జిందాబాద్ అంటున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి వారి వల్లే దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటే ఇలాంటివారి ఆటలు కట్టించవచ్చని రాజనాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. -
ఒమర్ ప్రభుత్వంపై మెహబూబా ముఫ్తి నిప్పులు
కిష్టావార్ జిల్లాలో మతపరమైన ఘర్షణలు చోటి చేసుకుని ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తుందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి ఆదివారం శ్రీనగర్‌లో ఆరోపించారు. ఘర్షణలు చెలరేగిన కిష్టావార్ జిల్లాలోని ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆదివారం ఆమె ప్రయాణామైయ్యారు. అయితే ఆమె ప్రయాణాన్ని పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఒమర్ ప్రభుత్వంపై మెహబూబా ముఫ్తి నిప్పులు చెరిగారు. కిష్టావార్ జిల్లాలో చోటు చేసుకున్న ఘర్షణలో 2 మరణించగా, 60 మందికిపైగా గాయపడ్డారని, ఇంత జరిగిన రాష్ట ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని ఎద్దేవా చేశారు. రాష్టంలో ఇంత దారుణం చోటు చేసుకున్న ప్రజల మధ్య సోదరభావం, మతసామర్యం పెంపొందించేందుకు ఒక్క చర్య చేపట్టకపోవడంతో ఒమర్‌పై మండిపడ్డారు. ఆ ప్రభుత్వ విధానల వల్ల రాష్ట్రంలోని వివిధ మతాలు ఐకమత్యంగా జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. మతాల మధ్య సామరస్యం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందం మాదిరిగా తయారైందన్నారు. -
రాజకీయ నేతలను రానివ్వం: ఒమర్ అబ్దుల్లా
పుకార్లు నమ్మొద్దని తమ రాష్ట్ర ప్రజలకు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి చేశారు. కిష్ట్వార్ సంఘటనపై దర్యాప్తు నివేదిక ఆధారంగా తక్షణమే చర్య తీసుకుంటామని ఆయన హామీయిచ్చారు. ప్రజల మనోభావాలతో ఆడుకునే రాజకీయ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని ఆయన హితవు పలికారు. కిష్ట్వార్ మతఘర్షణల్లో ఇద్దరు మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మతఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటించేందుకు అరుణ్ జైట్లీతో సహా రాజకీయ నాయకులెవరినీ అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా, కిష్ట్వార్ జిల్లాలో పర్యటించేందుకు వచ్చిన బీజేపీ నేత అరుణ్‌జైట్లీని జమ్మూ ఎయిర్‌పోర్టులో పోలీసులు నిర్బంధించారు. కిష్ట్వార్ జిల్లాలో చెలరేగిన మత ఘర్షణల నేపథ్యంలో ఆరు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. కిష్ట్వార్ జిల్లాలో శుక్రవారం జరిగిన మత ఘర్షణల్లో ఇద్దరు మరణించగా, ఇరవై మందికి గాయాలైన సంగతి తెలిసిందే. ఈద్ ప్రార్థనల తర్వాత కొందరు దేశ వ్యతిరేక నినాదాలు చేయడంతో ఘర్షణలు మొదలయ్యాయి. దీనికి నిరసనగా బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగదళ్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో జమ్మూలో శనివారం ర్యాలీ నిర్వహించారు. సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకోవడంతో, వారిపై రాళ్లు రువ్వారు. దీంతో సీఆర్పీఎఫ్ జవాన్లు లాఠీలు ఝుళిపించి, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో జమ్మూ ఎస్పీ సహా ఏడుగురు గాయపడ్డారు.మరోవైపు, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ గీలానీ ఆదివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు.