కిష్టావార్ జిల్లాలో మతపరమైన ఘర్షణలు చోటి చేసుకుని ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్లు వ్యవహారిస్తుందని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తి ఆదివారం శ్రీనగర్లో ఆరోపించారు. ఘర్షణలు చెలరేగిన కిష్టావార్ జిల్లాలోని ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆదివారం ఆమె ప్రయాణామైయ్యారు. అయితే ఆమె ప్రయాణాన్ని పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. దీనిపై ఆమె తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఒమర్ ప్రభుత్వంపై మెహబూబా ముఫ్తి నిప్పులు చెరిగారు. కిష్టావార్ జిల్లాలో చోటు చేసుకున్న ఘర్షణలో 2 మరణించగా, 60 మందికిపైగా గాయపడ్డారని, ఇంత జరిగిన రాష్ట ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తుందని ఎద్దేవా చేశారు.
రాష్టంలో ఇంత దారుణం చోటు చేసుకున్న ప్రజల మధ్య సోదరభావం, మతసామర్యం పెంపొందించేందుకు ఒక్క చర్య చేపట్టకపోవడంతో ఒమర్పై మండిపడ్డారు. ఆ ప్రభుత్వ విధానల వల్ల రాష్ట్రంలోని వివిధ మతాలు ఐకమత్యంగా జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. మతాల మధ్య సామరస్యం అనేది నేతి బీరకాయలో నెయ్యి చందం మాదిరిగా తయారైందన్నారు.