రాజస్థాన్‌లోని ఉత్తర్‌లాయ్ వైమానికస్థావరంలో మిగ్–21 విమానం కాక్‌పిట్‌లో కూర్చున్న రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్
గాంధీనగర్/న్యూఢిల్లీ: దేశభద్రత విషయంలో గుజరాత్‌లోని పాక్ సరిహద్దున ఉన్న ‘సర్ క్రీక్’ ప్రాంతం అత్యంత కీలకమైనదని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. గుజరాత్ భద్రతకు సైతం కీలకమైన ఈ ప్రాంతాన్ని త్వరలోనే సందర్శిస్తానన్నారు. అక్కడి సరిహద్దు భద్రతను సమీక్షించి, అక్కడి సైనికుల్లో మరింత స్పూర్తినింపేలా వారితో మాట్లాడతానని చెప్పారు. అరేబియా సముద్రతీరంలోని భారత్–పాక్ సరిహద్దు భూభాగాన్ని సముద్రజలాలు 96 కి.మీ. పొడవునా లోపలికి చొచ్చుకొచ్చి వేరుచేశాయి. ఇలా వేరుబడిన పొడవైన భూభాగాన్ని ‘సర్‌క్రీక్’ సరిహద్దుగా వ్యవహరిస్తున్నారు.
రోజూ త్రివిధ దళాధిపతులతో భేటీ: రక్షణలో వ్యూహాత్మక అంశాలపై వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఇకపై ప్రతీరోజు త్రివిధ దళాధిపతులతో నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. సైనిక వనరుల సముపార్జనకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను వెంటనే ఆమోదించేందుకు ప్రతీ 15రోజులకు డిఫెన్స్ అక్విజీషన్ కౌన్సిల్‌ను సమావేశపరచాలని నిర్ణయించారు.