ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని, జాతీయ భద్రత దృష్ట్యా రాజకీయాల్ని పక్కన పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిఘా సమాచారాన్ని పంచుకోవడంపై రాష్ట్రాలు దృష్టిపెట్టాలని, తద్వారా ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో నిర్వహించిన 11వ అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించకూడదన్నారు.