bits pilani hyderabad campus
-
బిట్స్ పిలానీ సీనియర్ ప్రొఫెసర్‌గా డీఆర్డీఓ మాజీ చైర్మన్ జి.సతీష్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: రక్షణ పరిశోధన,అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) మాజీ చైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి ప్రముఖ శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థ బిట్స్ పిలానీ (బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్)లో సీనియర్ ప్రొఫెసర్‌గా చేరారు. ముఖ్యంగా జాతీయ భద్రతా రంగానికి సంబంధించి పరిశోధనలు ఆవిష్కరణలకు ఆయన సేవలు అందిస్తారని బిట్స్ పిలానీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఈ నియామకంపై సతీష్ రెడ్డి స్పందించారు. ‘డీఆర్డీఓలో దాదాపు 39 ఏళ్ల నుంచి చేస్తున్న పరిశోధనను ఓ విద్యాసంస్థలో కొనసాగించటం చాలా సహజం. బిట్స్ పిలానీ చాలా కాలంగా పరిశోధనా కార్యక్రమాల్లో డీఆర్డీఓకు భాగస్వామిగా ఉంది. ఇక్కడ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ (CRENS)ను ఏర్పాటు చేయటం స్వాగతించదగ్గ విషయం. నేను ఈ కేంద్రానికి సహకరించాలని, పరిశ్రమలు, భద్రతా సంస్థలు, స్టార్టప్‌లతో కలిసి జాతీయ భద్రత కోసం ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతిని అందించాలని ఎదురుచూస్తున్నా’ అని అన్నారు.పరిశోధన, విద్యాపరమైన అంశాలకు ఆయన నాయకత్వం వహిస్తారు.అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ పరిశోధనా విశిష్టత కోసం సీఆర్ఈఎన్ఎస్లో అధునాతన పరిశోధన కార్యక్రమాలకు మార్గనిర్దేశం చేస్తారు. రీసెర్చ్ అడ్వైజరీ బోర్డుకు ఆయన అధ్యక్షత వహిస్తారు. ఇక.. ఆయన డీఆర్డీఓలో చేపట్టిన అత్యంత ప్రభావశీల ప్రాజెక్టుల్లో కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే. -
Hyderabad: ఆన్లైన్లో బిట్స్ పిలానీ బీఎస్సీ డిగ్రీ
సాక్షి, హైదరాబాద్: జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని బిట్స్ క్యాంపస్ లో ‘కొర్సెరా’ భాగస్వామ్యంతో మొట్టమొదటి ఆన్లైన్ కోర్సు (బీఎస్సీ కంప్యూటర్స్) సోమవారం ప్రారంభమైంది. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరంలేదని క్యాంపస్ డైరెక్టర్ జి.సుందర్ తెలిపారు. 12వ తరగతి లేదా దానికి సమాన అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్లైన్ డిగ్రీకి ప్రపంచంలో ఏ మూలనుంచైనా పరీక్ష రాయొచ్చన్నారు. బిల్స్ పిలానీతో కలిసి ఆన్లైన్ డిగ్రీ కోర్సును ప్రారంభించడం పట్ల కొర్సెరా చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బెట్టీ వాండెన్ బోష్ హర్షం వ్యక్తం చేశారు. అర్హత గల విద్యార్థులు నేటి నుంచి నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం బిట్స్ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. ఓయూ పీజీ కోర్సుల పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెలలో జరిగే వివిధ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండ ఈ నెల 16 వరకు, రూ.300 అపరాధ రుసుముతో 19 వరకు పొడిగించినట్లు సోమవారం అధికారులు తెలిపారు. వివిధ పీజీ కోర్సులతో పాటు ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 1, 3, 4, 5, 7, 9 బ్యాక్లాగ్, ఇంప్రువ్మెంట్కు ఫీజు చెల్లించవచ్చు. పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబసైట్లో చూడవచ్చు. (క్లిక్: 833 ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల) -
బిట్స్‌పిలానీ విద్యార్థి ఆత్మహత్య
మేడ్చెల్ జిల్లా : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిట్స్ పిలాని కాలేజీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రిపుల్ ఈ మూడో సంవత్సరం చదువుతున్నరాఘవ్ శాంతారం(21) అనే విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాఘవ్ స్వస్థలం తమిళనాడులోని చెన్నై. నిన్న దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్ చూసిన అనంతరం గదిలోకి వెళ్లాడని స్నేహితులు తెలిపారు. సోమవారం ఉదయం స్నేహితులు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఈ విషయం వార్డెన్‌కు తెలిపారు. వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. సెమిస్టర్లో ఫెయిల్ అవడం వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
‘తెలంగాణ’ను ఐటీ హబ్‌గా మారుస్తాం
♦ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ♦ బిట్స్‌లో లాంఛనంగా ఫేజ్ టూ భవనానికి భూమిపూజ శామీర్‌పేట్: తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో రెండో దశ భవన నిర్మాణ పనులకు శనివారం మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేస్తోందని, విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద విద్యా సంస్థగా ఎదగాలని ఆశించారు. ఇక్కడ చదివే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకుని తెలంగాణ రాష్ట్రానికి మంచిపేరు తీసుకురావాలన్నారు. బిట్స్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ఆశయ సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. బిట్స్ డెరైక్టర్ వీఎస్ రావు మాట్లాడుతూ బిట్స్ పిలానీలో నూతనంగా 10 లక్షల చదరపు అడుగులతో సుమారు రూ.370 కోట్లతో ఈ నిర్మాణాలు చేపడుతున్నామని, 2018 డిసెంబర్ నాటికి వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం బిట్స్‌లో 3,200 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో విద్యాభ్యాసం చేస్తున్నారని, ఈ భవన నిర్మాణం పూర్తయితే మరో 2,100 మంది విద్యార్థులు అదనంగా చదివే వీలుంటుందన్నారు. 2025 నాటికి ఇక్కడి క్యాంపస్‌లో 10 వే ల మంది విద్యార్థులు విద్యను అభ్యసించేలా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ హబ్‌గా మారడం ఖాయమని వీఎస్.రావు కొనియాడారు. అనంతరం నూతన భవనం నిర్మాణాల వివరాలను మంత్రి కేటీఆర్‌కు బిట్స్ డెరైక్టర్ వీఎస్ రావు వివరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ క్యాంపస్‌లో కలియదిరిగారు. తరువాత రాష్ట్రంలో పర్యావరణం, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన అవగాహన సైకిల్ ర్యాలీని మంత్రి కేటీఆర్ గన్ పేల్చి ప్రారంభించారు. కార్యక్రమంలో బిట్స్ సెక్రటరీ జేఎస్ రంజన్, మేడ్చల్ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, టీఆర్ఎస్ వివిధ మండలాల అధ్యక్షులు విష్ణుగౌడ్, భాస్కర్, ఎంపీటీసీ సభ్యుడు జహంగీర్, టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘బిట్స్’లో ముగిసిన ఇగ్నైట్ ఫెస్ట్
శామీర్‌పేట్: నగరంలోని అనాథ చిన్నారులతో (ఒకటో తరగతి నుంచి 10వరకు) నిర్మాణ్ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో మూడురోజులుగా నిర్వహిస్తున్న ఇగ్నైట్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ముగిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు చిన్నారుల కేరింతల మధ్య కొనసాగింది. నిర్మాణ్ ఎన్జీఓ సంస్థ, బిట్స్ విద్యార్థులు చివరిరోజు అనాథ చిన్నారులకు ఇన్నోవేషన్, సులభంగా గణితాన్ని ఎలా చదవాలి?. ఆరోగ్య సంరక్షణ, పుస్తక వైజ్ఞానిక ప్రదర్శన, కథలు చెప్పటం, వివిధరకాల కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు తరగతి గదుల్లో నూతన పరికరాల గురంచి వివరించారు. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. ముగింపు వేడుకల్లో భాగంగా విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో విజేతలకు లారూస్ ల్యాబ్స్ ఫార్మాస్యూటికల్ ప్రతినిధులు సీతారామయ్య దంపతులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాణ్ సంస్థ అధ్యక్షుడు సాయిహరీష్ మాట్లాడుతూ.. చిన్నారులతో గడిపిన మూడురోజులు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. వారు బిట్స్ వీడి పోతుంటే ఇంటినుంచి సొంత ఆత్మీయులు వెళ్తున్న బాధ కలిగిందన్నారు. కార్యక్రమంలో ఇగ్నైట్ సంస్థ అధ్యక్షుడు సాయిహరీష్తో పాటు మాజీ అధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి, కోశాధికారి చందుసాయి హేమంత్, నిర్వాహకులు దినేష్, హేమంత్, శ్రవంతి, సూర్యతేజ, మౌర్య, చిన్నారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ స్వప్న సాకారం హైదరాబాద్ ‘బిట్స్’
సందర్భం బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్.. దివంగతు లైన డాక్టర్ కృష్ణకుమార్ బిర్లా, వైఎస్ రాజశేఖర రెడ్డిల స్వప్న సాకారం. 2005 జూలైలో నాటి ముఖ్య మంత్రి వైఎస్‌ని ఆయన ఆఫీసులో యాథృచ్చికంగా నేను కలుసుకున్నప్పుడు అది పురుడుపోసుకుంది. నేను ప్రస్తావించిన వెంటనే ఆయన హైదరాబాద్‌కు బిట్స్ పిలానీని తీసుకురావాలని అభ్యర్థించారు. బిట్స్ పిలానీపై తొలిసారిగా ప్రారంభమైన చర్చ డాక్టర్ కేకే బిర్లాతో వైఎస్ నిర్విరామ ప్రయ త్నాల ద్వారా ఆరునెలల్లోపే వాస్తవరూపం దాల్చింది. రాజ్యసభలో ఒకేదఫా ఎంపీలుగా డాక్టర్ బిర్లా, వైఎస్ సుపరిచితులే. అప్పటికే గోవా క్యాంపస్ కోసం నిధులు కేటాయించినందున హైదరాబాద్‌లో మరొక క్యాంపస్ ప్రారం భానికి బిర్లా ఇష్టపడలేదు. ఈ విషయంలో తన అశక్తతను కూడా ఆయన ైవైఎస్కి తెలియజేశారు. కానీ హైదరాబాద్‌లో క్యాంపస్‌ను ప్రారంభించేలా డాక్టర్ బిర్లాకు నచ్చచెప్పేందుకు వైఎస్ తనదైన మార్గంలో ప్రయత్నించారు. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌కు 2007 ఏప్రిల్ నెలలో శంకుస్థా పన జరిగింది. క్యాంపస్ భవనం ప్లాన్ రుసుమును దాని ప్రారంభ సమా వేశంలోనే మాఫీ చేస్తున్నట్లు వైఎస్ ప్రకటించడమే కాకుండా, క్యాంపస్‌కు నిరంతరాయంగా నీరు, విద్యుత్తును సరఫరా చేయగలమని హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలోనైనా ఐఐఎంల స్థాయిలో ఒక మేనేజ్ మెంట్ స్కూల్‌ని ప్రారంభించాల్సిందిగా ఆయన బిర్లాను అభ్యర్థించారు. దానికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని కూడా వాగ్దానం చేశారు. 14 నెలల్లోపే క్యాంపస్‌ను ప్రారంభించాలన్న డాక్టర్ బిర్లా కలను సాకారం చేయడానికి, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్‌గా ఉన్న నాకు అన్ని రకాల సహాయ సహకారాలను అందించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ అధికా రులకు వైఎస్ ఆదేశాలిచ్చారు. నేను తలపెట్టిన ఏ పనిలోనైనా 24 గంటలు దాటి జాప్యం జరిగినట్లయితే వెంటనే వచ్చి తనను కలుసుకోవలసిందిగా కూడా వైఎస్ నాకు సూచించారు. కానీ నేను అలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదుర్కో లేదనుకోండి. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ద్వారా మద్దతును వైఎస్ అందించనట్లయితే, ఎంఓఈఎఫ్, ఇతర క్లియరెన్సులు సాధ్యమై, 2008లో బిర్లా క్యాంపస్‌లో విద్యా కార్యక్రమాలు మొదలయ్యేవి కావు. శంకుస్థాపన జరిగిన రోజు బహిరంగసభలో పేర్కొన్నట్లుగా 2008 ఆగస్టులో క్యాంపస్‌ను ప్రారంభించాలని బిర్లా కలగన్నారు. నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న ప్రత్యేక ఆసక్తి వల్లే బిర్లా కల సాకారమైంది. నేడు, బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ హైదరాబాద్‌కు ఆభరణంగా గుర్తింపు పొందింది. 200 ఎకరాలలో విస్తరించి, 20 వేల చదరపుటడుగులలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ క్యాంపస్‌లో ఇంజనీరింగ్, సైన్స్, హ్యుమానిటీస్ విభాగాల్లో విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యు యేట్, పీహెచ్.డి ప్రోగ్రామ్‌లను చేపడుతున్నారు. 2021 నాటికి హైదరాబాద్ క్యాంపస్‌లో విద్యార్థుల సంఖ్యను 5,200కు తీసుకుపోవాలని ప్రస్తుతం ఈ విద్యా సంస్థ విస్తరణ పథకాలు చేపడుతోంది. ఈ క్యాంపస్‌లోని విద్యార్థు లలో 60 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రాంతాలకు చెందినవారే. బిట్స్ పిలానీ క్యాంపస్‌ని అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు ప్రజలకు వైఎస్ రాజ శేఖరరెడ్డి అందించిన వరం అని చెప్పవచ్చు. వ్యాసకర్త యాక్టింగ్ వైస్ ఛాన్సలర్, బిట్స్ పిలానీ vsr@hyderabad.bits-pilani.ac.in ప్రొ॥వి.ఎస్.రావు -
ఘనంగా బిట్స్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: శామీర్‌పేటలోని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ‘బిట్సాగ్లోబల్ మీట్-2014’ కార్యక్రవుం ఘనంగా జరిగింది. రెండో రోజైన శనివారం కార్యక్రవుంలో భాగంగా 1972-75 బ్యాచ్ విద్యార్థులు గురు దక్షిణం కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాగ్నిజెం ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఎన్ఫోచిప్ ఫౌండర్, సీఈఓ ప్రతుల్ షర్ఫ్ తదితరులు పాల్గొని కీలకోపన్యాసం చేశారు. అనంతరం స్టాప్ క్రైబింగ్ అండ్ స్టార్ట్ ఎక్స్‌ప్లోరింగ్, బిట్సాన్ సోషల్ ఇన్నోవేషన్, బిల్డింగ్ కనెక్షన్స్ ఎక్రాస్ ది ఇయుర్, ఎందుకు భారతదేశ ఆహారమే ఉత్తవుం వంటి వివిధ అంశాలపై పలు కంపెనీల సీఈఓలు పాల్గొని బృంద చర్చలు నిర్వహించారు. 1964 నుంచి నేటి వరకు బిట్స్ పిలానీలకు చెందిన వివిధ సంస్థల్లో చదువుకొని ఉన్నత స్థానాలను అలంకరించిన ప్రముఖులు పాల్గొని వారు సాధిం చిన విజయాలను, రూపొందించిన ఆవిష్కరణలను వపర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో టాటా గ్లోబల్ బేవరేజెస్ ఎండీ, సీఈఓ హరీష్ భట్, ఇన్టెల్ క్యాపిటల్ డెరైక్టర్ రాజ్గుల్లవుూడి, కైరాన్ యూక్సలేరేటర్ ఫౌండర్ లలిత్ అహుజా, సోషల్ వెంచర్స్ పార్టనర్స్ ఫౌండర్ అఖిల కృష్ణకువూర్, 24ఇంటు7 ఇన్నోవేషన్ ల్యాబ్స్ రవి గరికపాటి, యుురేకా ఫోర్బ్స్ సీఈఓ రవున్ వెంకటేశ్, రచరుుత దిలిప్ డీసౌజా, ఫొటోగ్రాఫర్ ఎంవీ శ్రీరాం, హెల్ప్‌ఏజ్ ఇండియూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వుథ్యూ చెరిన్, కేఆర్కే ల్యాబ్స్ ఫౌండర్, సీఈఓ జయున్ రావుకుట్టి వంటి ఎందరో ప్రవుుఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యూరు. వెంకటేష్ తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండో రోజు ముగింపు కార్యక్రమంలో పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.