సాక్షి, హైదరాబాద్: జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని బిట్స్ క్యాంపస్ లో ‘కొర్సెరా’ భాగస్వామ్యంతో మొట్టమొదటి ఆన్‌లైన్ కోర్సు (బీఎస్సీ కంప్యూటర్స్) సోమవారం ప్రారంభమైంది. ఈ కోర్సులో చేరడానికి ఎలాంటి ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరంలేదని క్యాంపస్ డైరెక్టర్ జి.సుందర్ తెలిపారు. 12వ తరగతి లేదా దానికి సమాన అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఆన్‌లైన్ డిగ్రీకి ప్రపంచంలో ఏ మూలనుంచైనా పరీక్ష రాయొచ్చన్నారు. బిల్స్ పిలానీతో కలిసి ఆన్‌లైన్ డిగ్రీ కోర్సును ప్రారంభించడం పట్ల కొర్సెరా చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బెట్టీ వాండెన్ బోష్ హర్షం వ్యక్తం చేశారు. అర్హత గల విద్యార్థులు నేటి నుంచి నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాల కోసం బిట్స్ వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.
ఓయూ పీజీ కోర్సుల పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెలలో జరిగే వివిధ పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఎలాంటి అపరాధ రుసుము లేకుండ ఈ నెల 16 వరకు, రూ.300 అపరాధ రుసుముతో 19 వరకు పొడిగించినట్లు సోమవారం అధికారులు తెలిపారు. వివిధ పీజీ కోర్సులతో పాటు ఐదేళ్ల ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 1, 3, 4, 5, 7, 9 బ్యాక్‌లాగ్, ఇంప్రువ్‌మెంట్‌కు ఫీజు చెల్లించవచ్చు. పూర్తి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబసైట్‌లో చూడవచ్చు. (క్లిక్: 833 ఇంజనీర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల)
Comments
Please login to add a commentAdd a comment