సాక్షి, హైదరాబాద్:
శామీర్‌పేటలోని బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో ‘బిట్సాగ్లోబల్ మీట్-2014’ కార్యక్రవుం ఘనంగా జరిగింది. రెండో రోజైన శనివారం కార్యక్రవుంలో భాగంగా 1972-75 బ్యాచ్ విద్యార్థులు గురు దక్షిణం కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాగ్నిజెం ట్ టెక్నాలజీ సొల్యూషన్స్ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ, ఎన్ఫోచిప్ ఫౌండర్, సీఈఓ ప్రతుల్ షర్ఫ్ తదితరులు పాల్గొని కీలకోపన్యాసం చేశారు. అనంతరం స్టాప్ క్రైబింగ్ అండ్ స్టార్ట్ ఎక్స్‌ప్లోరింగ్, బిట్సాన్ సోషల్ ఇన్నోవేషన్, బిల్డింగ్ కనెక్షన్స్ ఎక్రాస్ ది ఇయుర్, ఎందుకు భారతదేశ ఆహారమే ఉత్తవుం వంటి వివిధ అంశాలపై పలు కంపెనీల సీఈఓలు పాల్గొని బృంద చర్చలు నిర్వహించారు.
1964 నుంచి నేటి వరకు బిట్స్ పిలానీలకు చెందిన వివిధ సంస్థల్లో చదువుకొని ఉన్నత స్థానాలను అలంకరించిన ప్రముఖులు పాల్గొని వారు సాధిం చిన విజయాలను, రూపొందించిన ఆవిష్కరణలను వపర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో టాటా గ్లోబల్ బేవరేజెస్ ఎండీ, సీఈఓ హరీష్ భట్, ఇన్‌టెల్ క్యాపిటల్ డెరైక్టర్ రాజ్‌గుల్లవుూడి, కైరాన్ యూక్సలేరేటర్ ఫౌండర్ లలిత్ అహుజా, సోషల్ వెంచర్స్ పార్టనర్స్ ఫౌండర్ అఖిల కృష్ణకువూర్, 24ఇంటు7 ఇన్నోవేషన్ ల్యాబ్స్ రవి గరికపాటి, యుురేకా ఫోర్బ్స్ సీఈఓ రవున్ వెంకటేశ్, రచరుుత దిలిప్ డీసౌజా, ఫొటోగ్రాఫర్ ఎంవీ శ్రీరాం, హెల్ప్‌ఏజ్ ఇండియూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వుథ్యూ చెరిన్, కేఆర్కే ల్యాబ్స్ ఫౌండర్, సీఈఓ జయున్ రావుకుట్టి వంటి ఎందరో ప్రవుుఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యూరు. వెంకటేష్ తదితర ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండో రోజు ముగింపు కార్యక్రమంలో పలువురు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
ఘనంగా బిట్స్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Published Sun, Jan 5 2014 12:07 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement