శామీర్‌పేట్: నగరంలోని అనాథ చిన్నారులతో (ఒకటో తరగతి నుంచి 10వరకు) నిర్మాణ్ ఎన్‌జీఓ సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని బిట్స్‌పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో మూడురోజులుగా నిర్వహిస్తున్న ఇగ్నైట్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ముగిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు చిన్నారుల కేరింతల మధ్య కొనసాగింది. నిర్మాణ్ ఎన్‌జీఓ సంస్థ, బిట్స్ విద్యార్థులు చివరిరోజు అనాథ చిన్నారులకు ఇన్నోవేషన్, సులభంగా గణితాన్ని ఎలా చదవాలి?. ఆరోగ్య సంరక్షణ, పుస్తక వైజ్ఞానిక ప్రదర్శన, కథలు చెప్పటం, వివిధరకాల కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు తరగతి గదుల్లో నూతన పరికరాల గురంచి వివరించారు.
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు..
ముగింపు వేడుకల్లో భాగంగా విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంట్లో విజేతలకు లారూస్ ల్యాబ్స్ ఫార్మాస్యూటికల్ ప్రతినిధులు సీతారామయ్య దంపతులు బహుమతులు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాణ్ సంస్థ అధ్యక్షుడు సాయిహరీష్ మాట్లాడుతూ..
చిన్నారులతో గడిపిన మూడురోజులు జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. వారు బిట్స్ వీడి పోతుంటే ఇంటినుంచి సొంత ఆత్మీయులు వెళ్తున్న బాధ కలిగిందన్నారు. కార్యక్రమంలో ఇగ్నైట్ సంస్థ అధ్యక్షుడు సాయిహరీష్‌తో పాటు మాజీ అధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి, కోశాధికారి చందుసాయి హేమంత్, నిర్వాహకులు దినేష్, హేమంత్, శ్రవంతి, సూర్యతేజ, మౌర్య, చిన్నారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
‘బిట్స్’లో ముగిసిన ఇగ్నైట్ ఫెస్ట్
Published Mon, Jan 25 2016 12:25 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement