బిట్స్‌పిలానీ విద్యార్థి ఆత్మహత్య | bits pilani student commited suicide | Sakshi
Sakshi News home page

బిట్స్‌పిలానీ విద్యార్థి ఆత్మహత్య

Published Mon, Feb 5 2018 7:22 PM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

bits pilani student commited suicide - Sakshi

ఆత్మహత్యకు పాల్పడిన బిట్స్‌ పిలానీ విద్యార్థి రాఘవ్‌ శాంతారం(21)

మేడ్చెల్ జిల్లా : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిట్స్ పిలాని కాలేజీ క్యాంపస్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ట్రిపుల్‌ ఈ మూడో సంవత్సరం చదువుతున్నరాఘవ్ శాంతారం(21)  అనే విద్యార్థి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాఘవ్‌ స్వస్థలం తమిళనాడులోని చెన్నై. నిన్న దక్షిణాఫ్రికా, ఇండియా మ్యాచ్‌ చూసిన అనంతరం గదిలోకి వెళ్లాడని స్నేహితులు తెలిపారు. సోమవారం ఉదయం స్నేహితులు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఈ విషయం వార్డెన్‌కు తెలిపారు.

వారొచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. సెమిస్టర్‌లో ఫెయిల్‌ అవడం వల్లే మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement