పెద్దల సభలో ఫిరాయింపుల జోరు | Chandrababu Naidu operation run akars | Sakshi
Sakshi News home page

పెద్దల సభలో ఫిరాయింపుల జోరు

Published Sun, Jun 21 2015 2:21 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

పెద్దల సభలో ఫిరాయింపుల జోరు - Sakshi

పెద్దల సభలో ఫిరాయింపుల జోరు

 సాక్షి, హైదరాబాద్: ఇటీవలి కాలంలో రాజకీయాల్లో నైతిక విలువలపై మాట్లాడుతున్న చంద్రబాబు  అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిలో బలం లేకపోవడంతో మొదట మండలి సభ్యులపైనే దృష్టి సారించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 50 ఉండగా, అందులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగనందున తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇక మిగిలిన 41 మందిలో అధికార పార్టీకి చెందిన వారు కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌తోసహా ప్రతిపక్షం బలంగా ఉండటంతో జీర్ణించుకోలేని చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేసి పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించారు.
 
 ఆయన 2014 జూన్ 8న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా... జూన్ 21వ తేదీన ఒకేరోజు ఇతర పార్టీలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్పించుకున్నారు. గవర్నరు కోటా ఎమ్మెల్సీలు ఇందిర, షేక్ హుసేన్, ఎమ్మెల్యే కోటా కింద ఎన్నికైన రవి వర్మ, ఉపాధ్యాయ రంగ ఎమ్మెల్సీలు చైతన్యరాజు, గాదె శ్రీనివాసులు నాయుడు, పుల్లయ్యలు ఇలా వరుసగా భారీ ఎత్తున ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకున్నారు. రెండో రోజు మరో ముగ్గురి చేరికతో మండలిలో టీడీపీ బలం 20కి చేరింది. మరికొందరు ఇతర పార్టీల ఎమ్మెల్సీల మద్దతు కూడగట్టుకున్న టీడీపీ ఆ తర్వాత మండలి వైస్ చైర్మన్ స్థానంలో సతీష్‌రెడ్డిని కూర్చోబెట్టింది.
 
 ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే...
 గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన నంద్యాల లోక్‌సభ సభ్యుడు ఎస్పీ వై రెడ్డి కనీసం ప్రమాణ స్వీకారం చేయడానికి ముం దే టీడీపీ కండువా కప్పారు. ప్రలోభాలు, బెదిరింపులతో లొంగదీసుకుని ఆయనను చేర్పించుకున్నారు. అలాగే విశాఖ జిల్లా అరకు నుంచి వైఎస్సార్ కాంగ్రె స్ తరఫున ఎంపీగా ఎన్నికైన కొత్తపల్లి గీతను కూడా బాబు ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement