సాక్షి,తాడేపల్లి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తేల్చిందని వైఎస్సార్‌సీపీ నేత సతీష్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో బుధవారం(అక్టోబర్ 16) ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు.
‘స్కిల్ కేసులో ఈడీ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. ఈడీ ఇచ్చిన ప్రెస్‌నోట్‌లో ఎక్కడా క్లీన్ చిట్ ఇస్తున్నామని వెల్లడించలేదు. ఈడీ ప్రెస్‌నోట్‌ను చంద్రబాబు తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఎల్లో మీడియాలో గోబెల్స్ కన్నా ఘోరంగా తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. స్కిల్ కేసులో ఈడీ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయి. సీమెన్స్ స్కాంలో ఉన్న వారి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
రానున్న రోజుల్లో గోబెల్స్‌ని మరచిపోయి, తప్పుడు ప్రచారం అనగానే చంద్రబాబే గుర్తొస్తారు. సాక్షాత్తూ ఈడీయే ఆస్తులను అటాచ్ చేస్తే చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎల్లోమీడియాలో ఎలా రాస్తారు? చంద్రబాబు మెడకు ఈడీ ఉరితాడు బిగుసుకుంది. అయినా తమకు తామే బాబు ముఠా క్లీన్ ఇచ్చుకోవటం వెనుక మతలబు ఏంటి? అసలు క్లీన్‌చిట్ ఇవ్వాల్సింది కోర్టులు కదా? కేసు విచారణలో ఉండగానే క్లీన్‌చిట్ అని చంద్రబాబు ముఠా ఎలా అంటుంది’ అని సతీష్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇదీ చదవండి: అరాచకానికి హద్దు లేదా: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment