
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సింగారెడ్డి సతీష్‌కుమార్‌రెడ్డిని నియమించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ, 2024లో వైఎస్సార్‌సీపీ పార్టీది ఓటమి కాదు.. కేవలం చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలకు ప్రజలు మరో మారు మోసపోయారన్నారు. మూడు నెలల్లోనే వ్యతిరేకత మూటగట్టుకున్న చరిత్ర కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

‘‘అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కుంటిసాకులు చెప్పడం విడ్డూరం. ఎకానమిక్స్‌లో పీజీ చేసిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఉండదా?. పదవిపై వ్యామోహంతో అబద్ధపు వాగ్దానాలు చేశాడు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు ప్రజల తరపున పోరాడతాం’’ అని సతీష్‌రెడ్డ పేర్కొన్నారు.
‘‘పులివెందులలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను పూర్తిచేయాలి. పులివెందుల నియోజకవర్గంలో కాలేటి వాగు ప్రాజెక్ట్, వేంపల్లి సుందరీకరణ,100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే పూర్తి చేయాలి. ఎటువంటి పనులు ప్రారంభించకుండా ఇసుకను దొంగ రవాణా చేస్తున్నారు. దోచుకోవడానికేనా ప్రజలు అధికారం ఇచ్చింది’’ అంటూ సతీష్‌రెడ్డి ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment