
సాక్షి, వైఎస్‌ఆర్ జిల్లా: జన్మభూమి కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులకు ఊహించని పరిణామాలు ఎదురౌతున్నాయి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫమైన ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకులను ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏం చేశాయంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. తాజగా వైఎస్‌ఆర్ జిల్లాలో తెలుగుదేశం నాయకులకు ఇదే పరిస్థితి ఎదురైంది.
వివరాల్లోకి వెళ్తే వైఎస్‌ఆర్ జిల్లా తొండూరు మండలం ఇనగలూరులో శుక్రవారం జన్మభూమి కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం నేత, శాసన మండలి మాజీ వైఎస్ ఛైర్మెన్ సతీష్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అక్కడి ప్రజలను నుంచి సతీష్ రెడ్డికి ఊహించని అనుభవం ఎదురైంది. ఏహోదాతో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటూ స్థానిక ప్రజలు ఆయన్ను నిలదీశారు. దీంతో సతీష్‌రెడ్డి చేసేది ఏమీలేక అక్కడి నుంచి ఆగ్రహంగా వెనుదిరిగాడు.
Comments
Please login to add a commentAdd a comment